కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
- Harishth Thanniru
- Updated on- July 13, 2025 / 01:43 PM IST
CM Chandrababu Naidu
CM Chandrababu Naidu: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడించారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో ఉంచిన భౌతికకాయాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మృతి బాధాకరం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. నటన అంటే ఏ విధంగా ఉండాలో 40ఏళ్ల పాటు నటించి చూపించారు. కోటతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఎంతో ప్రజా సేవ చేశారు. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
