CM KCR : నేడు కడెం ప్రాజెక్ట్, వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే

సీఎం కేసీఆర్‌ ఇవాళ కడెం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఉదయం కడెం ప్రాజెక్టుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే చేయనున్నారు. ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లను పరిశీలించిన తర్వాత...వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడనున్నారు. ఈ నెల 18వ తేదీనే ఏరియల్‌ సర్వే చేయాల్సి ఉన్నా.. వాతావరణం సహకరించకపోవడం, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆయన కడెం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లలేదు.

  • Published On : July 25, 2022 / 08:41 AM IST

Cm Kcr

CM KCR aerial survey : సీఎం కేసీఆర్‌ ఇవాళ కడెం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఉదయం కడెం ప్రాజెక్టుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే చేయనున్నారు. ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లను పరిశీలించిన తర్వాత…వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడనున్నారు. ఈ నెల 18వ తేదీనే ఏరియల్‌ సర్వే చేయాల్సి ఉన్నా.. వాతావరణం సహకరించకపోవడం, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆయన కడెం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లలేదు.

దీంతో ఇవాళ ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. వాస్తవానికి ఈ నెల 18వ తేదీనే ఎస్పారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలించాలని సీఎం కేసీఆర్ భావించారు. అయితే 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఉండటం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో కేసీఆర్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

CM KCR Kadem : కడెం ప్రాజెక్టును పరిశీలించనున్న సీఎం కేసీఆర్

ఈనెల 16వ తేదీన హనుమకొండకు వెళ్లిన సీఎం కేసీఆర్ 17, 18వ తేదీల్లో భద్రాచలం, ఏటూరునాగారంలో పర్యటించారు. అక్కడ వరద పరిస్థితులను సీఎం తెలుసుకున్నారు. అలాగే వరద ముంపు ప్రాంతాల శాశ్వత పరిష్కారం చేయాలన్న సీఎం కేసీఆర్.. ఇందుకోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సీఎం కేసీఆర్ వెంట వెళ్లే అవకాశం ఉందని సమాచారం.