CM KCR Birthday Celebrations: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలతో పాటు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ తో రాజకీయంగా కలిసి పని చేశానని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో రాష్ట్రానికి సేవలందించాలని అన్నారు. కేసీఆర్ ఆలోచనలకు, ప్రకటనలకు కార్యరూపం ఇవ్వాలని చెప్పారు. అప్పుడే దాని ఫలితం సమాజం పొందడానికి వీలుంటుందని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీపై ఎల్లప్పుడూ భగవంతుని దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని జగన్ ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీపై ఎల్లప్పుడూ భగవంతుని దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.@TelanganaCMO pic.twitter.com/0RXql8AOG4
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2023
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి సీఎం కేసీఆర్ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు. కేసీఆర్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ముర్ము ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ బర్త్ డే వేడుకల కేక్ కట్ చేశారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగొండ అనాధాశ్రమంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి హాజరై విద్యార్థులకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. అదేవిధంగా మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మంత్రి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగొండ అనాధాశ్రమంలో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరై విద్యార్థులకు పండ్లు, దుస్తులు పంపిణీతో పాటు అనాధాశ్రమానికి వాషింగ్ మెషిన్, ఫ్రీజర్, నిత్యవసర సరుకులు అందచేయడం జరిగింది. #HappyBirthdayKCR pic.twitter.com/aLyyXW1Cxc
— V Srinivas Goud (@VSrinivasGoud) February 17, 2023
దశాబ్దాల వివక్ష నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి, దేశానికే స్ఫూర్తినిచ్చేలా.. అభివృధి, సంక్షేమంను సమానంగా అందిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన @BRSparty అధినేత, @TelanganaCMO, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ #KCR గారికి జన్మదిన శుభాకాంక్షలు.@KTRBRS#HappyBirthdayKCR pic.twitter.com/lJNYnnDrRr
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) February 17, 2023
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ 69వ జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేసి, రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ పుట్టినరోజు సందర్భంగా.. సిద్దిపేట పట్టణంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కేక్ కట్ చేశారు.
సీఎం కేసీఆర్‌కు మంత్రి తన్నీరు హరీష్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అంటే కారణజన్ముడుగా.. చిరస్మరణీయుడుగా ప్రజల తల రాతలను మార్చే మహనీయుడుగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అంటూ ఆకాంక్షించారు.
" కేసీఆర్ అంటే కారణజన్ముడుగా... చిరస్మరణీయుడుగ ప్రజల తల రాతలను మార్చే మహనీయుడుగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి.. !!
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు?
2/2 pic.twitter.com/Vr3FUtjGyg— Harish Rao Thanneeru (@BRSHarish) February 17, 2023
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Offered prayers at Balkampet Yellamma Temple for Hon’ble CM KCR Garu on the occasion of his birthday #HappyBirthdayKCR pic.twitter.com/GkFDPqJvaW
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2023
సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 70 కేజీల భారీ కేక్‌ను మంత్రి కట్ చేశారు. అంతకుముందు కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని కోరుకుంటూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
Minister Jagadishwar Reddy cutting the cake at CM KCR's birthday celebrations
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
Birthday Greetings to Hon’ble Chief Minister of Telangana Shri K. Chandrashekar Rao Garu. May god bless you with long and healthy life.@TelanganaCMO pic.twitter.com/rSIfwCTCHh
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 17, 2023
ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Birthday greetings to Telangana CM Shri KCR Garu. I pray for his long life and good health. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2023
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Warm Birthday wishes to Chief Minister of Telangana Sri K Chandrasekhara Rao Garu. May you be blessed with long life and good health.@TelanganaCMO pic.twitter.com/PKgM95eqNk
— N Chandrababu Naidu (@ncbn) February 17, 2023
గౌరవనీయులైన @TelanganaCMO శ్రీ కె చంద్రశేఖర్ రావుగారికి జన్మదిన శుభాకాంక్షలు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 17, 2023