CM Kcr: వాసాలమర్రికి 20 సార్లు వస్తా.. సీఎం కేసీఆర్
గ్రామంలో ఐకమత్యం, పట్టుదల అవసరం. కష్టం, బాధ ఎవరిదైనా ఒకటే అనే భావన ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్‌గా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ నాయకత్వంలో అద్భుతమైన పని జరగాలని తెలిపారు. ఇక సమావేశం అనంతరం అటునుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు కేసీఆర్.
- kunduru Vinod
- Published On : June 22, 2021 / 05:07 PM IST
Cm Kcr
CM Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం దత్తగ్రామమైన వాసాలమర్రిలో పర్యటించారు. గ్రామానికి వెళ్లిన సీఎం గ్రామప్రజలతో కలిసి భోజనం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తిరిగే సరికి వాసాలమర్రి బంగారు వాసాలమర్రి కావాలని సీఎం అన్నారు.
ఈ గ్రామానికి కనీసం 20 సార్లు వస్తానని తెలిపారు సీఎం. గ్రామంలో నలుగురు మాత్రమే పరిచయమయ్యారని, అందరు పరిచయం అయ్యేల సభ పెట్టాలని సూచించారు. గ్రామ ప్రజల మధ్య ఎటువంటి బేదాభిప్రాయాలు ఉండొద్దని తెలిపారు. అందరు కలిసికట్టుగా పనిచేస్తేనే గ్రామం బంగారు వాసాలమర్రిగా మారుతుందని ఆయన తెలిపారు.