Cm Kcr Press Meet
KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కీలక ప్రకటన చేయబోతున్నారు. రాత్రి 7 గంటలకు ఆయన బేగంపేటలోని క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడబోతున్నారు. ప్రెస్ మీట్ ఉంటుందని 2గంటల ముందు సీఎంఓ నుంచి మీడియా సంస్థలకు సమాచారం వచ్చింది. మీడియా ప్రతినిధులు అందుబాటులో ఉండాలని సీఎంఓ కోరింది.
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడబోతున్నట్టు సమాచారం అందుతోంది. పెట్రోల్ రేట్లు, ధాన్యం కొనుగోళ్లు, దళిత బంధు పథకం కొనసాగింపుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని సమాచారం అందుతోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా సీఎం మాట్లాడబోతున్నట్టు సమాచారం.
Read More : Jasprit Bumrah: భారత జట్టు కెప్టెన్‌గా బూమ్రా..?
హుజూరాబాద్ ఉపఎన్నిక కూడా ఇటీవలే ముగిసింది. ఈ ఉపఎన్నిక ఫలితం ఇప్పటికే రాష్ట్రమంతటా హాట్ టాపిక్ అవుతోంది. దీంతో… కేసీఆర్ తాజాగా చేయబోయే ప్రకటనలు పొలిటికల్ మూడ్ ను మార్చేలా ఉంటాయన్న అంచనాలు ఏర్పడ్డాయి. కేంద్రం-రాష్ట్రం మధ్య ఆర్థిక లావాదేవీలు, ధాన్యం కొనుగోళ్లు, ఉద్యోగాల కల్పన, మిలియన్ మార్చ్ కు బీజేపీ ప్రయత్నాలు, దళిత బంధు, కొత్త పథకాలు, ఏపీతో జల వివాదాలు, పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. లాంటి పొలిటికల్, జనరల్ హాట్ టాపిక్స్ చాలా ఉండటంతో… సీఎం స్పందన ఏ అంశాలపై ఉంటుందన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.