Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వ సలహాదారులను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి

పబ్లిక్ రిలేషన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ బాధ్యతలు స్వీకరిస్తారు.

Revanth Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులను నియమించారు. ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు.

ప్రొటోకాల్ మరియు పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా హర్కర వేణుగోపాల్, పబ్లిక్ రిలేషన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ బాధ్యతలు స్వీకరిస్తారు. ముగ్గురు సలహాదారులకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు.

లండన్‌‌లో రేవంత్ రెడ్డి..
ప్రస్తుతం రేవంత్ రెడ్డి లండన్‌‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఆయన బిగ్‌ బెన్‌, టవర్‌ బ్రిడ్జి నిర్మాణాలను సందర్శించారు. తెలంగాణలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై అధికారులతో ఆయన చర్చించారు. రేవంత్ రెడ్డితో పాటు సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌, ఇతర అధికారులు ఉన్నారు. కాగా, ఈ నెల 26 తర్వాత తెలంగాణ నలుమూలలా సుడిగాలి పర్యటన చేస్తానని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. హైదరాబాద్ వ్యాపారి నుంచి 98లక్షలు కాజేశారు.. ఎలాగో తెలిస్తే షాకే