CM Revanth Reddy : మూసీ నదీ తీరాన ఓంకారేశ్వర ఆలయం.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆలయ ప్రత్యేకతలివే..

CM Revanth Reddy : మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు.

CM Revanth Reddy

  • మూసీ నదీ తీరాన ఓంకారేశ్వర ఆలయం
  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
  • పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

CM Revanth Reddy : మూసీ నది అభివృద్ధికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు.

Also Read : Beer Price Hike : మందుబాబులకు బిగ్అలర్ట్.. బీర్లు తాగుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..

గండిపేట మండలం మంచిరేవులలో ఉన్న వీరభద్రస్వామి -మచిలేశ్వర స్వామి ఆలయం పక్కనే ఎనిమిది ఎకరాల్లో రూ.663 కోట్లతో ఓంకారేశ్వర స్వామి ఆలయం, ఇతర నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు మూసీ రీవర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ప్రణాళికలు రూపొందించింది. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలు, సలహాలతో ఆలయ నిర్మాణ శైలిని ఖరారు చేశారు.

ఆలయంలో వంద అడుగుల గాలిగోపురాన్ని నిర్మిస్తున్నారు. మూసీ నది మధ్యలో దీనిపై వంద అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీరభద్ర స్వామి ఆలయం గుట్టపైకి తీగల వంతెన ఏర్పాటు, పార్కింగ్ కాంప్లెక్స్, రోడ్లు, ల్యాండ్ స్కేప్‌లు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గర్భాలయ గోపురాన్ని 14అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు.. 64 అడుగుల ఎత్తుతో ప్రత్యేకంగా నిర్మించనున్నారు.