Revanth Reddy: ఆనాడు మీరు నాటిన మొక్కే నేడు సీఎం.. పదేళ్లలో కేసీఆర్ చేసింది సున్నా.. మిడ్జిల్ సభలో రేవంత్ సంచలన కామెంట్స్
మిడ్జిల్ మండల కేంద్రంలో జరిగిన ‘కృతజ్ఞత సభ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆవేశపూరితంగా, భావోద్వేగంతో ప్రసంగించారు.
- V Santhosh Kumar
- Published on- July 4, 2026 / 08:00 PM IST
CM Revanth Reddy made sensational comments against BRS government at the Midjil gratitude meeting.
- మిడ్జిల్ నుంచే సీఎం ప్రస్థానం
- కేసీఆర్ మార్క్ దోపిడీపై ధ్వజం
- కాంగ్రెస్ విజయానికి ప్రజల అండ
Revanth Reddy: మిడ్జిల్ మండల కేంద్రంలో జరిగిన ‘కృతజ్ఞత సభ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆవేశపూరితంగా, భావోద్వేగంతో ప్రసంగించారు. 2006 జూలైలో మిడ్జిల్ మండల ప్రజలు స్వతంత్ర అభ్యర్థిగా తనను గెలిపించి సువర్ణాక్షరాలతో చరిత్ర లిఖించారని, ఆనాడు వారు నాటిన మొక్కే నేడు మహావృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచిందని గుర్తుచేసుకున్నారు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అదే రోజున కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ గడ్డ బూర్గుల రామకృష్ణారావు, జైపాల్ రెడ్డి వంటి గొప్ప నాయకులను అందించిందని, జైపాల్ రెడ్డి ఎదుగుదలకు తోడ్పడిన ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.
Vijayawada Incident: ప్రాణం తీసిన కొబ్బరిబోండం.. ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కుటుంబ పెద్దల దుర్మరణం
తనపై ఓడిన రబ్బానీకి మంచి పదవి ఇవ్వాలని డిప్యూటీ సీఎంకు సూచించారు.ఆనాడు డార్క్ మండలాలుగా ఉన్న మిడ్జిల్, గట్టు మండలాల ప్రజలు చీకట్లనుంచి వెలుగులోకి రావాలని తీసుకున్న నిర్ణయమే తనను ఈ స్థాయికి చేర్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మండలాన్ని జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దడం తన బాధ్యత అని, అందుకే దీనిని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దత్తత తీసుకోవాలని కోరారు. గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తిగా పరిపాలనపై తనకు పూర్తి అవగాహన ఉందని, గ్రామాల్లో సమస్యలు తీరితే రాష్ట్ర సమస్యలు తీరినట్లేనని స్పష్టం చేశారు.
జనగణనలో కులగణన చేపట్టి వందేళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని, నల్లమల నుంచి వచ్చిన తనకు పరిపాలన చేతకాదన్న వారి అహంకారానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాలనలో 8 లక్షల 21 వేల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, కోటి ఎకరాలకు నీళ్లు ఏవీ ఇవ్వకుండా మళ్లీ ఏ మొహం పెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Minister Atchannaidu: రొయ్యలకు రోగం… తినేవాళ్లు, రైతులు బీ కేర్ ఫుల్.. రంగంలోకి ఏపీ ప్రభుత్వం
బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దండుకున్న దుర్మార్గులని, ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడుతూ ఆడబిడ్డల మాటలు దొంగతనంగా వినేవారు అసలు మనుషులేనా అని ధ్వజమెత్తారు. అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన వారు ఇక అధికారాన్ని మర్చిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో పేదలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను విజయవంతంగా అందిస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు.
చివరి గింజ వరకు కొని రైతుల ఖాతాల్లో 80 వేల కోట్లు వేశామని, డ్రగ్స్ అమ్మేవారిని జైల్లో పెట్టామని, ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వం ఎందుకు పోవాలని ప్రశ్నించారు. వలసల పాలమూరును అభివృద్ధి చేయడానికి తన ప్రాణాలనైనా అర్పిస్తానని, 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా, దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు మిడ్జిల్ మండలం నుంచే మొదటి అడుగు పడాలని పిలుపునిచ్చారు.
