CM Revanth Reddy : కాళేశ్వరం విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం.. బీజేపీ కుట్ర చేస్తోంది.. హరీష్‌రావు సూచనలతోనే ఈటల మాటలు..

CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy

CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ అన్నారు. హరీశ్ రావు సూచనల మేరకే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారని అన్నారు. కాళేశ్వరంపై ఎంపీ ఈటల అవాస్తవాలు చెప్పారు.. ఎంపీ ఈటల అంటే మాకు గౌరవమే.. తన వ్యాఖ్యలతో ఈటల తన గౌరవం పొగొట్టుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మా ప్రయత్నం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : Vietnam Boat Accident : వియత్నాం బోటు ప్రమాదం.. మృతుల వివరాలు వెల్లడించిన భారత రాయబార కార్యాలయం.. ఏపీకి వాసులు వీరే..

మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని 2020 మే18వ తేదీన ఈఈ రమణారెడ్డి కేసీఆర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. లోపాలు సవరించాలని అప్పట్లోనే ఇంజినీర్లు సూచించారని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యంతో లోపాలు పెరిగి పెద్దవై బ్యారేజ్ కుప్పకూలిందని, 2022 జులై 14న వరదలకు కన్నెపల్లి పంప్‌హౌస్ దెబ్బతిందని చెప్పారు. ఇప్పటికే కన్నెపల్లి పంప్‌హౌస్ వినియోగంలోకి రాలేదని, 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని ప్రస్తావించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై బీఆర్ఎస్ హయాంలోనే ఎన్డీఎస్ఏ కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేసిన సీఎం రేవంత్.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలం కాదని ఎన్డీయే తేల్చిచెప్పిందని, ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణ లోపాలపై గతంలోనే ఎన్డీఎస్ఏ కమిటీ నివేదిక ఇచ్చిందని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కానీ, బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై పదేపదే అబ్దాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ముందు రెండు కమిటీలు ఉన్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం వేసిందయితే.. మరొకటి కిలాడీ కమిటీ. కిలాడీ కమిటీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, ఈటల సభ్యులు. బ్యారేజీల పునరుద్దరణ అంశంలో ఎన్డీఎస్ఏ కమిటీ సూచనలు పాటించాలని నిర్ణయించాం. కిలాడీల కమిటీ సూచనలు పాటించబోమని సీఎం రేవంత్ అన్నారు. పాత కమీషన్లు రాబట్టుకునేందుకే హరీశ్ రావు మూడు నెలల మంత్రి పదవి అడుగుతున్నారని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. గురువు కళ్లలో ఆనందం కోసం నేను నీళ్లు వదిలానని హరీశ్ రావు మాట్లాడుతుండు.. పట్టిసీమ కట్టిందే బీఆర్ఎస్ హయాంలో కదా.. పట్టిసీమ కట్టి 105 టీఎంసీలు తరలించినప్పుడు హరీశ్ రావు ఏం చేస్తున్నాడు అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా కేసీఆర్, హరీశ్ రావుతో కలిసిపోయారు. హరీశ్ రావు సూచనలతో ఆయన మాట్లాడుతున్నాడు. నీళ్లను ఎత్తిపోయాలని ఈటల రాజేందర్ కోరుతున్నారు. ప్రాజెక్టులను ఎన్డీఎస్ఏకు అప్పగిస్తాం.. నీళ్లు ఎత్తిపోయాలని ఎన్డీఎస్ఏను కోరండి.. మేమయితే నీళ్లు ఎత్తిపోయాం.. అలా చేస్తే భద్రాచలం మునుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు.