Cm Revanth Reddy: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. విదేశీ ఉద్యోగాలు, ఉచిత శిక్షణ.. సీఎం రేవంత్ కీలక సమీక్ష!
తెలంగాణ యువతకు గ్లోబల్ స్థాయిలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం(Cm Revanth Reddy) వేగంగా అడుగులు వేస్తోంది.
- V Santhosh Kumar
- Published on- July 31, 2026 / 05:01 PM IST
cm revanth reddy review on young india skill university and tomcom
- యువతకు విదేశీ ఉద్యోగాల శిక్షణ
- అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ నూతన కోర్సులు
- టామ్‌కామ్ వ్యవస్థ మరింత బలోపేతం
Cm Revanth Reddy: తెలంగాణ యువతకు గ్లోబల్ స్థాయిలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సచివాలయంలో కార్మిక, ఉపాధి కల్పన (శక్తి) శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బలోపేతం:
స్కిల్ యూనివర్సిటీని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఆదేశించిన సీఎం, నూతన ఆవిష్కరణల కోసం ప్రత్యేక ‘రీసెర్చ్ సెంటర్’ను ఏర్పాటు చేయాలన్నారు. విదేశీ ఉద్యోగాలకు అనుగుణంగా విద్యార్థులకు విదేశీ భాషలను నేర్పించేందుకు ప్రత్యేక వింగ్‌ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ఇంజనీరింగ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కోర్సులు:
ప్రభుత్వ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ సౌకర్యం కల్పించాలని సూచించారు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో (ATC) డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్ (EV) సర్వీసింగ్ కోర్సులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
టామ్‌కామ్ ద్వారా విదేశీ అవకాశాలు & కొత్త నర్సింగ్ కాలేజీలు:
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM)ని మరింత వేగవంతం చేయాలన్నారు. పాస్‌పోర్ట్ మంజూరు నుండి విదేశీ కంపెనీల్లో ఉద్యోగ సాధన వరకు బాధ్యతలను టామ్‌కామ్‌యే పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతర్జాతీయంగా నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ పెరుగుతున్నందున రాష్ట్రంలో కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు తగిన అనుమతులు ఇవ్వాలని అధికారులను సీఎం కోరారు.
