CM Revanth Reddy : పేదల ఓట్ల తొలగింపుపై దేశవ్యాప్త పోరు.. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!
CM Revanth Reddy : పేదల ఓట్లను భారీగా తొలగిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న ఓట్ బచావో.. దేశ్ బచావో ర్యాలీని నిర్వహించారు.. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- November 1, 2026 / 03:58 PM IST
CM Revanth Reddy
- ఢిల్లీలో ఇండియా కూటమి భారీ మార్చ్
- బీజేపీ గద్దె దిగే వరకు పోరాటం ఆగదు
- ఓట్ల తొలగింపుపై దేశవ్యాప్త పోరు..
- సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy : ఓట్ల చోరీపై కాంగ్రెస్ సమరానికి సిద్ధమైంది. పేదలు, సామాన్యుల ఓట్లను భారీగా తొలగిస్తున్నారంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారంలో కొనసాగేందుకు ఓట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ గద్దె దిగే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఓట్ల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు..
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ :
ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ మార్చ్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రామ్‌లీలా మైదానంలో ఆదివారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మింటో రోడ్-కన్నాట్ ప్లేస్ జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే ఈ మార్చ్ రామ్‌లీలా మైదానం వరకు కొనసాగనుంది. ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు :
ఈ ర్యాలీకి తెలంగాణ నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు 7 వేల మందికి పైగా కార్యకర్తలు ఢిల్లీ చేరుకున్నారు. 77 బస్సులు, 600 కార్లలో నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి రామ్‌లీలా మైదానానికి ర్యాలీ చేరుకోనున్నారు.
ఇండియా కూటమి కీలక డిమాండ్లు :
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, 2023 ఎన్నికల కమిషన్ చట్టాన్ని రద్దు చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని కోరుతోంది.
అంతేకాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. మొత్తానికి ఓట్ల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ చేపట్టిన ఈ ఆందోళన దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది..
