Cheyutha Pensions: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. నేటినుంచే కొత్త పింఛన్లు.. సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా!

దీపావళి కానుకగా కొత్తగా ఎంపిక చేసిన 4.5 లక్షల మందికి 'చేయూత(Cheyutha Pensions)' పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడే కొడంగల్‌లో ప్రారంభించనున్నారు.

Cm revanth reddy to distribute cheyutha pension to 4 5 lakh beneficiaries today in kodangal

Cheyutha Pensions: తెలంగాణలోని నిరుపేద, ఎగువ దిగువ తరగతుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం దీపావళి పండుగ వేళ గొప్ప సామాజిక భరోసాను కల్పించింది. సంక్షేమ పథకాల్లో భాగంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎంపిక చేసిన మరో 4.5 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు ‘చేయూత(Cheyutha Pensions)’ పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. పండుగ వేళ లక్షలాది పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో ఈ బృహత్తర నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

AP ZPTC MPTC Results: పరిషత్ పోరులో ఆసక్తికర పరిణామాలు.. వెంట్రుకలు అమ్ముకునే మహిళకు పట్టం.. కొత్తతరం నాయకత్వంతో గ్రామీణ రాజకీయాలు!

కోడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం.. ఈ నెల నుంచే ఖాతాల్లోకి నగదు:

వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గ కేంద్రంలో నవంబర్ 8న అనగా నేడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై, మంత్రి సీతక్కతో కలిసి లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసి ఈ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఎంపికైన లబ్ధిదారులందరికీ ఈ నవంబర్ నెల నుంచే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ కానుందని స్పష్టం చేశారు.

జిల్లాల వ్యాప్తంగా పంపిణీ.. వితంతువులు, దివ్యాంగులకు నెరవేరిన భరోసా:

కోడంగల్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైన వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాలు విస్తృతంగా జరగనున్నాయి. ఈ నిర్ణయం ద్వారా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులకు ప్రభుత్వం నుండి బలమైన ఆర్థిక ఆసరా లభించనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా పింఛన్లు అందిస్తామని ప్రభుత్వం ఉద్ఘాటించింది.