Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 22న ఖాతాల్లోకి డబ్బులు
మూడు విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
- Naveen
- Published On : March 15, 2026 / 07:37 PM IST
Rythu Bharosa Funds Representative Image (Image Credit To Original Source)
- తెలంగాణ రైతులకు శుభవార్త
- రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్
- 22న మొదటి విడత నిధులు జమ
- ఏప్రిల్ నెల మధ్యలో రెండో విడత
- ఏప్రిల్ నెలాఖరులో మూడో విడత నిధులు విడుదల
Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల తేదీ ఖరారు చేసింది. ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు. విడతల వారీగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తొలి విడతలో ఎకరం లోపు భూమి ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా నగదు జమ చేస్తారు. తొలి విడతగా మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద రూ.3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేయనుంది సర్కార్. ఈ దశలో సుమారు రూ.2,650 కోట్లు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. ఇక ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులను కూడా విడుదల చేయనుంది ప్రభుత్వం. మూడు విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా ఎకరాకు రూ.12 వేలు చొప్పున ఇస్తుంది.
Also Read: ‘రేయ్ ఏంట్రా ఇదంతా..’ నిమ్మకాయ జ్యూస్ కి గ్యాస్ చార్జ్ వేస్తారా.. అది కూడా మరీ ఇంతా..!
