KCR Birthday : కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో చూడండి..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
- Harishth Thanniru
- Published On : February 17, 2024 / 01:00 PM IST
CM Revanth Reddy
BRS Chief KCR Birthday : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ్టితో 70వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రం వ్యాప్తంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు స్వయంగా, సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ క్రమంలో ఉత్తమ్ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని రేవంత్ ఆకాంక్షించారు. తెలంగాణ పున:నిర్మాణంలో వారు పాత్ర పోషించి.. ఈ సభలో ప్రతిపక్ష నాయకుడుగా సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించడానికి వారికి పూర్తిస్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : మీరు చెప్పినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. అసెంబ్లీలోకి అడుగుపెట్టను : హరీశ్ రావు
మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు. pic.twitter.com/ANaRrjxtK3
— Telangana CMO (@TelanganaCMO) February 17, 2024
