మీరు చెప్పినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. అసెంబ్లీలోకి అడుగుపెట్టను : హరీశ్ రావు

అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్ పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం..

మీరు చెప్పినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. అసెంబ్లీలోకి అడుగుపెట్టను : హరీశ్ రావు

BRS MLA Harish Rao

BRS MLA Harish Rao : తెలంగాణ నీటిపారుదల రంగంపై శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. లక్షా 81వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేస్తే 15లక్షల ఎకరాలకు నీళ్లు మాత్రమే అందించారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతానికి 54వేల కోట్లు ఖర్చుచేసి 57లక్షల ఆయకట్టు సాగునీటిని అప్పటి ప్రభుత్వం అందించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేగిగడ్డ బ్యారేజీ గుండెకాయ లాంటిందని, కానీ, మేడిగడ్డ ప్రాజెక్టులో నిర్మాణ లోపం, అవినీతి వల్ల ఆ ప్రాజెక్టులు నేడు పనికిరాకుండా పోయిందని ఉత్తమ్ అన్నారు.

Also Read : కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా మారింది.. ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డగోలుగా అవినీతి : మంత్రి ఉత్తమ్

అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్ పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడగా ఉందని, అది శ్వేతపత్రం కాదు.. అబద్ధపు పత్రం అని హరీశ్ రావు అన్నారు. సత్యదూరమైన మాటలను అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ చెప్పారు. గత ప్రభుత్వంపై బురద చల్లాలనే శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. మిడ్ మానేరు ప్రాజెక్టులను మా హయాంలోనే పూర్తిచేశాం. 2017లో మిడ్ మానేరు పూర్తయింది. మిడ్ మానేరు కనుక ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయినట్లు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. భవిష్యత్తులో అసెంబ్లీకి రాను అంటూ హరీశ్ రావు సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో గోబెల్స్ ప్రచారం చేసినట్లే.. సభలోనూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. ఖర్చుల విషయంలో తప్పులు ఉన్నాయి. నిజాం కంటే ముందు లెక్కలు కూడా ఖర్చు పెట్టారా అంటూ కాంగ్రెస్ శ్వేతపత్రంపై హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కేఆర్ఎంబీ, కేంద్రానికి ఫిర్యాదు చేశామని అన్నారు.

 

ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ రాకుండా మూడు రోజులు ప్రిపేర్ అయ్యారు. కానీ, వాళ్లు కేవలం మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేశారంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమి పనులు చేయకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అంచనాను 35వేల కోట్ల అంచనా పెంచారు. ఒక్క ప్రాజెక్ట్ కు నాలుగు జిల్లాల్లో శంకుస్థాపన చేశారంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు. ప్రాజెక్టులు అప్పగించాలన్న గెజిట్ నోటిఫికేషన్ ను మేం వ్యతిరేకించామని హరీష్ రావు చెప్పారు. ఆయకట్టు విషయంలో శ్వేపత్రంలో రెండు చోట్ల రెండు విధాలుగా చెప్పారు. రూ. 775 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి, మిడ్ మానేరు పూర్తి చేశాం. సభను ఉత్తమ్ తప్పదోవ పట్టించే యత్నం చేశారంటూ హరీశ్ రావు మండిపడ్డారు