Telangana : నేడూ రేపు భారీ వర్షాలు

సోమ, మంగళవారాల్లో తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Telangana (2)

Telangana : బంగాళాఖాతం ఒరిసా తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఋతుపవనాలు చురుక్కుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలోని ఈశాన్య, ఉత్తర జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని జిల్లాలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

మరో మూడు రోజులపాటు తెలంగాణలో వాతావరణం చల్లగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఆదివారం పలు జిల్లాలో వర్షం కురిసింది. భద్రాద్రికొత్తగూడం జిల్లా పెంట్లంలో అత్యధికంగా 6.5 మీమీ వర్షపాతం నమోదైంది. ఇక సూర్యాపేట జిల్లా పెదవీడులో 3.3 మీమీ వర్షపాతం నమోదు కాగా ఖమ్మం జిల్లా పమ్మిలో 3.2 మీమీ వర్షపాతం నమోదైంది.

కాగా గత నెల చివరి వారంలో తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఇక ఆ తర్వాత మళ్లీ వర్షాలు రాలేదు. 20 రోజులపాటు వర్షాలు లేకపోవడంతో మెట్ట పంటలు కొద్దిగా దెబ్బతిన్నాయి. ఇక ప్రస్తుతం వర్షం కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి మూడు రోజులపాటు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షకు కురుస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-60 వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని సూచించింది.