Congress MLC Jeevan Reddy: ఆర్టీసీ విలీనాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు.. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఆ పని చేయాలి..

గవర్నర్ హైదరాబాద్‌లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని, అవసరం అయితే అసెంబ్లీ సమావేశాలను పొడగించి ఆర్టీసీ బిల్లు ఆమోదించాలి.

MLC Jeevan Reddy

MLC Jeevan Reddy: ప్రభుత్వం ఆర్టీసీ విలీనం బిల్లును రాజకీయాలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. నాల్గోరోజు శాసనసభ, శాసన మండలి సమావేశాల సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జీవన్ రెడ్డి మాట్లాడారు. గవర్నర్ కోరిన క్లారిటీ అంశాలను ప్రభుత్వం సీఏస్ ద్వారా వివరణ ఇప్పిస్తే బెటర్ అని అన్నారు. గవర్నర్ సీఎస్‌ను పిలిచి వివరణ కోరవచ్చు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో గవర్నర్ మాట్లాడడం మంచిదే. కానీ, సీఏస్‌తో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ఎందుకు నిర్వహించలేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

TSRTC Bill : ఆర్టీసీ బిల్లుపై కొనసాగుతున్న సస్పెన్స్.. గవర్నర్ తమిళిసై హాట్ కామెంట్స్

గవర్నర్ అడ్డు చెప్పడం వల్లే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావట్లేదనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఎస్‌ను పంపించి గవర్నర్ అనుమానాల‌ను నివృత్తి చేయాలి. పెన్షన్ బెన్ఫిట్, పే స్కేల్ ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఓల్డ్ పెన్షన్ స్కీంను ఆర్టీసీ కార్మికులకు కల్పించాలని అన్నారు.  గవర్నర్ హైదరాబాద్‌లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని, అవసరం అయితే అసెంబ్లీ సమావేశాలను పొడగించి ఆర్టీసీ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ ఫస్ట్‌ న ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

TSRTC Bill: రాజ్‌భవన్‌లోనే ఆర్టీసీ బిల్లు.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్ పడుతుందా?

మరోవైపు ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ ఉన్నతాధికారులను రాజభవన్‌కు పిలిపించారు. ఆర్టీసీ బిల్లుపై మరిన్ని వివరాలు అధికారుల నుంచి తెలుసుకుంటున్నారు. మరోవైపు స్పీకర్‌తో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటీ అయ్యారు. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదించిన వెంటనే.. బిల్లును స్పీకర్ అనుమతి‌తో టేబుల్ చేసే యోచనలో సర్కార్ ఉంది.