Covid-19 Positive: రంగారెడ్డిలో ఒకేసారి14 మందికి కొవిడ్ పాజిటివ్
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ప్రైవేట్ కాలేజిలో చదువుతున్న 14మంది స్టూడెంట్స్‌కు ఒకేసారి కరోనా పాజిటివ్ అని తేలింది. తోటి విద్యార్థులతో పాటు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.
- Subhan Ali Shaik
- Published On : December 29, 2021 / 09:32 AM IST
Telangana Covid Cases
Covid-19 Positive: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ప్రైవేట్ కాలేజిలో చదువుతున్న 14మంది స్టూడెంట్స్‌కు ఒకేసారి కరోనా పాజిటివ్ అని తేలింది. తోటి విద్యార్థులతో పాటు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. రెండ్రోజులుగా తీవ్రమైన చలి, జ్వరంతో బాధపడుతుండగా కళాశాల యాజమాన్యం మెడికల్ టెస్టులు చేయించింది.
ఫలితాల్లో 14 మంది విద్యార్దులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో అప్రమత్తమైన నార్సింగి మునిసిపల్ అధికారులు కళాశాల ఆవరణ మొత్తాన్ని శానిటేషన్ చేయించారు. మిగిలిన విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 7 ఒమిక్రాన్ కేసులు నమోదు అవగా.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కు చేరింది.
