Secunderabad : మహిళ ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ పోలీసు
సికింద్రాబాద్ రైల్వేస్ స్టేషన్ లో ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ పట్టుతప్పి కిందపడింది. రైలుకి, ప్లాట్ ఫామ్ కి మధ్యలో ఇరుక్కుపోయింది. ఆమెను గమనించిన రైల్వే కానిస్టేబుల్ ప్రమాదం నుంచి రక్షించారు
- kunduru Vinod
- Published On : July 31, 2021 / 03:54 PM IST
Secunderabad
Secunderabad : ఓ మహిళా ప్రయాణికురాలు కదులుతున్న రైతు ఎక్కోబోతుండగా జారీ కిందపడింది. అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అప్రమత్తమై ఆ మహిళ ప్రాణాలు కాపాడాడు. నసీమా బేగం అనే మహిళ కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి అదుపు తప్పి.. ప్లాట్‌ఫామ్, రైలు మధ్యలో ఇరుక్కుపోయింది.
ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వేస్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ దినేష్ సింగ్‌పై ఉన్నతాధికారులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇదే సమయంలో రైలులో ఉన్న వ్యక్తి చైను లాగాడు.. దీంతో రైలు కాసేపు నిలిచిపోయింది.
బాధిత మహిళను నసీమా బేగంగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
#WATCH | Telangana: A constable of Railway Protection Force (RPF) saved a woman from falling under moving train in Secunderabad. (30.07) pic.twitter.com/evlanew8op
— ANI (@ANI) July 31, 2021
