గ్రేటర్ హైదరాబాద్ లో తగ్గుతున్న కరోనా కేసులు

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం (ఏప్రిల్ 15, 2020) పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది.

  • Publish Date - April 16, 2020 / 04:05 AM IST

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం (ఏప్రిల్ 15, 2020) పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది.

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం (ఏప్రిల్ 15, 2020) పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. దీంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం నగరంలో 33 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో పాతబస్తీని ఒకే కుటుంబంలో 17 మంది కరోనా బాధితులు ఉండటం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం నాటికి హైదరాబాద్ లో మొత్తం 249 కేసులు నమోదు కాగా బుధవారం 267 గా నమోదు అయ్యాయి. 

గ్రేటర్ లోని మూడు జిల్లాలు హాట్ స్పాట్ పరిధిలోకి
అయితే మొన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్ లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించిన పాజిటివ్ కేసులను జీహెచ్ఎంసీలో కాకుండా సంబంధిత జిల్లా మొత్తం కేసుల్లో ప్రకటించారు. నిన్న నమోదైన కేసుల్లో మాత్రం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిల్లోని పాజిటివ్ కేసులను మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో కలపడంతో బుధవారం నాటి కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు.

హాట్ స్పాట్ జిల్లాల్లో లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు 
కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలను కేంద్ర ప్రభుత్వం హాట్ స్పాట్ జిల్లాలుగా ప్రకటిచింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హాట్ స్పాట్ జిల్లాల జాబితాలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలు ఉండటంతో ఈ జిల్లాల్లో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా 
మాదాపూర్ లోని ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ కాలనీలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా సోకడంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. రాకపోకలను నిలిపివేశారు. బాగ్ అంబర్ పేట డివిజన్ సీఈ కాలనీలో ఐదేళ్ల బాలికకు కరోనా పాజిటివ్ వచ్చింది. బుధవారం అధికారులు సీఈ కాలనీలో పరిస్థితిని సమీక్షించారు. 

ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వే హాస్పిటల్ లో 52 మంది అనుమానితులు
నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్ డివిజన్ సాబేర్ నగర్ నుంచి 13 మందిని, ముసారాంబాగ్ లోని హెగ్డే ఆస్పత్రి దగ్గర హోటల్ లో పని చేసే వ్యక్తిని క్వారంటైన్ కు తరలించారు. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వే హాస్పిటల్ లో 52 మంది అనుమానితులు, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో 17 చేరారు.  

వ్యక్తికి వైరస్ లక్షణాలు…బ్యాంకు మూసివేత
చంద్రాయణగుట్ట బార్కస్ ఎస్ బీఐ పక్కన నివసించే వ్యక్తికి వైరస్ లక్షణాలు ఉండటంతో ప్రజలు ఆందోళన పడ్డారు. బ్యాంకు పక్కనే పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తి నివసిస్తున్నాడని తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బ్యాంకు అధికారులతో మాట్లాడారు. బ్యాంకు లావాదేవీలను నిలిపివేశారు. బ్యాంకును మూసివేయాలని అధికారులను కోరారు. 

తెలంగాణలో హాట్‌స్పాట్ జిల్లాలు
తెలంగాణలో 28జిల్లాలను హాట్‌స్పాట్ కేంద్రాలుగా గుర్తించారు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కరీంనగర్, నిర్మల్. నల్గొండను కరోనా క్లస్టర్స్ కలిగిన హాట్‌స్పాట్ జిల్లాగా పేర్కొంది కేంద్రం.

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు
సూర్యాపేట, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, భద్రాద్రి, జగిత్యాల, జనగాం, జయశంకర్‌, కుమ్రం భీం, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, సిరిసిల్ల, సిద్దిపేటలను ఆరెంజ్ జోన్ జిల్లాలుగా ప్రకటించారు. 

కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న జిల్లాల్లో 14 రోజులు ఎలాంటి కేసులు నమోదు కాకుంటే వాటిని ఆరెంజ్ జోన్‌లో చేర్చుతారు. ఆరెంజ్ జోన్‌లోకి వచ్చిన తర్వాత మరో 14 రోజులు ఎలాంటి కేసులు నమోదు కాకుంటే గ్రీన్ జోన్‌గా మారుస్తారు.