×
Ad

Investment Scam : డైరెక్టర్ తేజ కుమారుడికి టోకరా.. ఏకంగా 63లక్షలు కాజేశారు..!

Investment Scam : ట్రేడింగ్ పేరుతో సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజను హైదరాబాద్ కు చెందిన దంపతులు బోల్తా కొట్టించారు.

director tejas

Investment Scam : ట్రేడింగ్ పేరుతో సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజను హైదరాబాద్ కు చెందిన దంపతులు బోల్తా కొట్టించారు. ట్రేడింగ్ లో భారీ లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించి.. నిలవునా ముంచేశారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి అమితవ్ వద్ద నుంచి రూ.63లక్షలు కాజేశారు.

Also Read : Thailand : ఘోర ప్రమాదం.. కదులుతున్న రైలుపై జారిపడిన క్రేన్.. 22మంది మృతి

తేజ కుమారుడు అమితవ్ వద్ద నుంచి రూ.63లక్షలు కాజేసినట్లు ఆ దంపతులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

డైరెక్టర్ తేజ కుమారుడు అమితవ్ వృత్తిరిత్యా వ్యాపారవేత్త. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. మోతీనగర్ ప్రాంతంకు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ దంపతులతో అమితవ్‌కు పరిచయం ఏర్పడింది. ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. ఒకవేళ నష్టం వస్తే తాముంటున్న అపార్టుమెంట్‌ను ఇస్తామని హామీ ఇచ్చారు. దంపతుల మాటలు నమ్మిన అమితవ్ భారీ మొత్తంలో ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టాడు.

ట్రేడింగ్‌లో పెట్టుబడిన పెట్టిన వారం రోజుల తరువాత రూ.9లక్షలు లాభం వచ్చిందంటూ నిందితులు కొన్ని నకిలీ పత్రాలను చూపించారు. దీనిని నిజమని నమ్మిన అమితవ్.. విడతల వారీగా మొత్తం రూ.63 లక్షలు వారికి అందజేశారు.

అయితే, రోజులుగా గడుస్తున్నా లాభాలు రాకపోగా.. అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన అమితవ్ వారిని నిలదీయగా ముఖం చాటేశారు. దీంతో వారిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అమితవ్ ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.