Egg Price Hike: కొండెక్కిన కోడిగుడ్డు ధర.. ట్రే ధర ఎంతో తెలిస్తే షాకవుతారు?
రాష్ట్రంలో కోడిగుడ్డు ధర(Egg Price Hike) సామాన్యుడికి భారంగా మారింది.
- V Santhosh Kumar
- Published on- June 27, 2026 / 10:37 AM IST
Egg prices have risen sharply in Telangana state. (1)
- కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది.
- విదేశీ ఎగుమతులతో డిమాండ్ పెరిగింది.
- మౌల్టింగ్ వల్ల ఉత్పత్తి తగ్గింది.
Egg Price Hike: రాష్ట్రంలో కోడిగుడ్డు ధర సామాన్యుడికి భారంగా మారింది. రెండు వారాల క్రితం వరకు రూ.6 నుండి రూ.6.50 వరకు ఉన్న గుడ్డు ధర, ప్రస్తుతం కిరాణా దుకాణాల్లో ఏకంగా రూ.7.50 నుండి రూ.8 కి చేరుకుంది. నెల క్రితం రూ.160 ఉన్న 30 గుడ్ల ట్రే ధర ఇప్పుడు రూ.220కి పెరిగింది. అంతర్జాతీయంగా గుడ్లకు డిమాండ్ పెరగడం, అమెరికా వంటి విదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు సాగడం, ఇరాన్ యుద్ధ ప్రభావంతో కోళ్ల దాణా ధరలు, కార్మికుల వేతనాలు భారీగా పెరగడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి.
Colleges Bandh: జూన్ 30న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్
ఉత్పత్తి తగ్గడానికి ‘మౌల్టింగ్ ప్రాసెస్’ కారణం:
ధరలు పెరగడానికి మరో ముఖ్య కారణం కోళ్లలో ‘మౌల్టింగ్ ప్రాసెస్’ (Molting Process) చేపట్టడం. సాధారణంగా కోళ్లు అధిక బరువు పెరగకుండా ఉండేందుకు రైతులు వాటికి కొన్ని రోజుల పాటు దాణా తగ్గించి కేవలం నీటిని మాత్రమే అందిస్తారు. ఆ తర్వాత క్రమక్రమంగా దాణా పరిమాణాన్ని పెంచుతారు. ఈ ప్రక్రియ వల్ల సుమారు 20 రోజుల పాటు కోళ్లు గుడ్లు పెట్టవు. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 600 మంది పౌల్ట్రీ రైతులు 3 కోట్ల లేయర్ కోళ్లను పెంచుతుండగా, రోజుకు 1.70 కోట్ల గుడ్ల(Egg Price Hike) ఉత్పత్తి జరుగుతోంది. అయితే ఈ మౌల్టింగ్ ప్రాసెస్ వల్ల ఉత్పత్తి భారీగా క్షీణించింది.
మున్ముందు మరింత ప్రియం?
ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గే అవకాశం ఉందని పౌల్ట్రీ నిర్వాహకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 20 రోజుల పాటు గుడ్ల ధరలు ఇదే రకంగా కొనసాగుతాయని, అవసరమైతే మరికొంత పెరిగే అవకాశం కూడా ఉందని వారు అంచనా వేస్తున్నారు.
