Etela Rajender-BJP : బీజేపీ కీలక నేతలతో ఈటల మంతనాలు.. పార్టీలో చేరికకు రంగం సిద్ధం!
బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికకు రంగం సిద్ధం అవుతోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో ఈటల మంతనాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీలో ఈటలకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేసే దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
- Sreehari A
- Published On : June 11, 2021 / 04:22 PM IST
Etela Rajender Bjp
Etela Rajender meet BJP Leaders : బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికకు రంగం సిద్ధం అవుతోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో ఈటల మంతనాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీలో ఈటలకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేసే దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే బీజేపీ ముఖ్యనేతలు ఈటల నివాసానికి వెళ్లినట్టు సమాచారం.
ఈటల ఇంటికి వెళ్లిన వారిలో తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్‌తో పాటు విజయశాంతి, డీకే అరుణ, రఘునందన్ రావు, రాజా సింగ్, రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డిల వంటి ముఖ్యనేతలున్నారు. తన గన్‌మెన్‌కు కొవిడ్ పాజిటివ్ రావటంతో బండి సంజయ్ హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఆయన ఈటల నివాసానికి వెళ్లలేదు.
అయితే ఈటల, బీజేపీ నేతలతో కలిసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనకు ముందే ఈటల రాజీనామా చేస్తారని తెలుస్తోంది. శనివారం (జూన్ 12) ఉదయం 10 గంటలకు గన్‌పార్క్ దగ్గర ఆయన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో ఇవ్వనున్నారు. ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఈటల బీజేపీలో చేరనున్నారు.
ఢిల్లీలో బీజేపీ సభ్యత్వం తీసుకుంటారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ సహా పలువురు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు.
