ఇదో చిల్లర ప్రభుత్వం.. కేసీఆర్ ఫుల్ ఫైర్.. పార్టీ కమిటీలన్నీ రద్దు..
రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ప్రభుత్వానికి ధాన్యం కొనటం కూాడా చేతకావటం లేదు.
- Naveen
- Updated on- April 27, 2026 / 05:49 PM IST
KCR: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఇది చిల్లర ప్రభుత్వం, చండాలమైన ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. ఆ మాటలు ఏంటి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని కేసీఆర్ వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనటం కూడా చేతకావటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదన్నారు. బొందల పడ్డట్టు అయిందని తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని కేసీఆర్ చెప్పారు. పక్క రాష్ట్రాల ప్రజలు పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వస్తుంటే ఈ ప్రభుత్వం గేట్లు తీయలేదని కేసీఆర్ ఆరోపించారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఒక వెధవ అని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మాట్లాడకుండా ఏం చేస్తున్నారని నిలదీశారు. మీరు మనుషులు కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ ఎంపీలు కనుక సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించే వాళ్లు అని అన్నారు. సీఆర్ పాటిల్ కాళేశ్వరం గురించి మాట్లాడితే రాజ్యసభలో సురేష్ రెడ్డి గట్టిగా ఖండించారని చెప్పారు. 2009లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని గుర్తు చేశారు. అశోక్ గులాటీ అనే మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు రైతుబంధు పథకం తెచ్చామన్నారు.
తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎన్నో సందర్భాల్లో తనను మానసిక క్షోభకు గురి చేశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటినీ తట్టుకుని వచ్చానని అన్నారు. హైదరాబాద్ విషయంలో వెనక్కి తగ్గమని సోనియాగాంధీ 16 సార్లు చెప్పినా తాను కాంప్రమైజ్ కాలేదన్నారు. హైదరాబాద్ విషయంలో రాజీపడితే తెలంగాణ విషయం త్వరగా తేలుతుందని సోనియా గాంధీ నాతో చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక, బీఆర్ఎస్ పార్టీ కమిటీలను రద్దు చేస్తూ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి 200 మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
Also Read: తొలగిన అడ్డంకి.. ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్
