KTR: నిజాం కాలేజీలో స్పీకర్‌కు సన్మానం చేస్తాం – పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంచి వారు, ఆయనపై మాకు గౌరవం ఉంది అని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ ఎలా చెప్తే స్పీకర్ అలా నడుస్తున్నారని విమర్శించారు.
- Naveen
- Published On : March 11, 2026 / 04:25 PM IST
Representative Image (Image Credit To Original Source)
- దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి
- కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తికి క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజా తీర్పును అవమానించడమే
- స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
KTR: పార్టీ పిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పునకు సన్మానం చేస్తామని అన్నారు. నిజాం కాలేజీలో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. భారత దేశ చరిత్రలో ఇటువంటి స్పీకర్ తీర్పులను ఎప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు కేటీఆర్. రాహుల్ గాంధీ ఎలా చెప్తే స్పీకర్ అలా నడుస్తున్నారని విమర్శించారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంచి వారు, ఆయనపై మాకు గౌరవం ఉంది అని కేటీఆర్ అన్నారు. పార్టీ పిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఆర్డర్ కాపీ ఇంకా ఇవ్వలేదన్నారు. ఆర్డర్ కాపీ రాగానే హైకోర్టుకు వెళ్తామని, స్పీకర్ తీర్పును సవాల్ చేస్తామని కేటీఆర్ తెలిపారు. రాహుల్ గాంధీకి సిగ్గు ఉంటే పార్టీ ఫిరాయింపులపై స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కడియం శ్రీహరి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో కడియం అనేక పదవులు పొందారని కేటీఆర్ గుర్తు చేశారు. ఖమ్మంలోని ముగ్గురు మంత్రుల బినామీల కోసం భూదాన్ భూముల్లో ఉన్న పేదల ఇళ్లు కూల్చారని కేటీఆర్ ఆరోపించారు. తప్పు తెలుసుకుని వారికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
Also Read: https: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేస్తున్నాయ్.. మీకు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు..
