KTR: ఏ పరీక్షకైనా సిద్ధం- మొయినాబాద్ డ్రగ్స్ ఘటనపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
అన్ని పార్టీల నేతలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నామన్నారు కేటీఆర్.
- Naveen
- Published On : March 15, 2026 / 05:06 PM IST
Representative Image (Image Credit To Original Source)
- డ్రగ్స్.. మనుషులను రాక్షసులుగా మారుస్తున్నాయి
- బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు డ్రగ్స్ తీసుకోవడం దురదృష్టకరం
- డ్రగ్స్ తీసుకున్న వారిని, పెడ్లర్స్ ని కఠినంగా శిక్షించాలి
- అన్ని పార్టీల నేతలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలన్న మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నా
KTR: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. డ్రగ్స్ అంశంలోకి బీఆర్ఎస్ పార్టీని లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డ్రగ్స్.. మనుషులను రాక్షసులుగా మారుస్తున్నాయన్న కేటీఆర్.. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు డ్రగ్స్ తీసుకోవడం దురదృష్టకరం అన్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిని, పెడ్లర్స్ ని కఠినంగా శిక్షించాలన్నారు.
డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్.. ఏ పరీక్షకైనా తాను సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులోకి తనను లాగాలని చూస్తే లీగల్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. మరోవైపు అన్ని పార్టీల నేతలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నామన్నారు కేటీఆర్.
”మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులను చేస్తాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా మాదకద్రవ్యాలు వాడటం దురదృష్టకరం. నేను వ్యక్తిగతంగా మాదకద్రవ్యాలు, నిషేధిత పదార్థాల వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. నా పార్టీ (BRS) మాదకద్రవ్యాల వాడకాన్ని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఖండిస్తుంది. ఎవరైనా మాదకద్రవ్యాలను వాడినా, అమ్మినా రాజకీయాలతో సంబంధం లేకుండా చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలి. నేను ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు డ్రగ్స్ పరీక్షకు హాజరు కావాలని మహేష్ కుమార్ గౌడ్ చేసిన సూచనను నేను స్వాగతిస్తున్నా. ప్రతి డ్రగ్స్ కేసులోకి నా పేరును లాగాలని చూస్తే చట్టపరమైన నోటీసులతో స్పందిస్తామని గట్టిగా హెచ్చరిస్తున్నా” అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు కేటీఆర్.
Also Read: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో కీలక పరిణామం.. టీడీపీ ఎంపీకి స్టేషన్ బెయిల్
Drugs create monsters out of human beings. It is unfortunate that even people in responsible positions are resorting to drug usage
I personally am strictly against drugs and usage of illicit substances.
My party BRS condemns usage of drugs and any illegal activities. Any one…
— KTR (@KTRBRS) March 15, 2026
