×
Ad

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ 

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలను ఎక్స్‌పోజ్‌ చేస్తున్నా..ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మల్చుకోవడంలో ఎక్కడో వెనకబడిపోతున్నామని ఆందోళన చెందుతున్నారట గులాబీ పార్టీ నేతలు.

Revanth Reddy, KCR

  • 90 శాతం మున్సిపాలిటీలను గెలుస్తామంటున్న కాంగ్రెస్
  • 50 శాతం మున్సిపాలిటీలపై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్
  • అధికార కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్‌..
  • ఎగ్డిట్ పోల్‌ సర్వే ఫలితాలతో బీఆర్ఎస్‌లో ఆందోళన

Telangana municipal elections: తెలంగాణలో గతంలో ఎప్పడూ లేని విధంగా ఈ సారి మున్సిపల్ ఎన్నికల ఫైట్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఎన్నికల ప్రచారం, ప్రలోభాలు..రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు కూడా హాజరై విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక భారీగా పోలింగ్ శాతం నమోదు కావడంతో..విజయంపై ఆయా పార్టీలు, అభ్యర్థులు ధీమాగా ఉన్నారు.

మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాజకీయపార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా 90 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకుంటామని చెబుతోంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కనీసం 50 శాతం మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుండగా..గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుంటామని బీజేపీ చెబుతోంది. మున్సిపల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్‌ అన్నీ అధికార కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి.

Also Read: ఏపీలో స్థానిక, మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు? ఏం జరుగుతోంది?

అత్యధిక మున్సిపాలిటీలను హస్తం పార్టీ కైవసం చేసుకుంటుందని..బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు..కనీసం కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా లేవన్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వ్యక్తం చేశాయి. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్‌కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఎంఐఎంకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి.

మున్సిపల్ ఎన్నికల్లో 7 కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెంను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని సర్వేలు అంచనా వేయగా..నిజామాబాద్, కరీంనగర్ ను బీజేపీ దక్కించుకుంటుందని చెప్పాయి. బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్‌ను కూడా సొంతం చేసుకోలేకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 68 నుంచి 76 సీట్లు, బీఆర్ఎస్ 29 నుంచి 36 సీట్లు, బీజేపీ 3 నుంచి 5 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి సర్వే సంస్థలు.

ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో ఆందోళన
మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను చూసి అధికార కాంగ్రెస్ సంబరపడిపోతుంటే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీకి ధీటుగా ప్రచారం నిర్వహించిన గులాబీ పార్టీ.. కనీసం 50 శాతం మున్సిపాలిటీలను, రెండు నుంచి మూడు కార్పొరేషన్లను దక్కంచుకుంటామన్న ధీమాతో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలుగా విఫలమైందని, ఎన్నికల సమయంలో చెప్పిన ఆరు గ్యారంటీలు సహా..ఏ ఒక్క హామీని కూడా రేవంత్ సర్కార్ నెరవేర్చలేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తుంది బీఆర్ఎస్.

దాంతో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంటే తాము చెప్పేవి ప్రజలు నమ్మలేదన్నది స్పష్టమవుతుందని కంగారు పడుతోందట కారు పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలను ఎక్స్‌పోజ్‌ చేస్తున్నా..ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మల్చుకోవడంలో ఎక్కడో వెనకబడిపోతున్నామని ఆందోళన చెందుతున్నారట గులాబీ పార్టీ నేతలు. మరి కొన్ని గంటల్లోనే ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలే నిజమవుతాయా.? లేదా బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు వస్తాయా.? అన్నది ఉత్కంఠ రేపుతోంది.