Ashwini Reddy (1)
Fake Woman Constable Arrest : హైదరాబాద్ లో నకిలీ మహిళా కానిస్టేబుల్ అరెస్టు అయ్యారు. ఇంటర్ వరకు చదివిన అశ్విని రెడ్డి అనే మహిళా జల్సాలకు అలవాటు పడ్డారు. ఫేక్ పోలీస్ ఐడి కార్డ్ తో కానిస్టేబుల్ గా అశ్విని రెడ్డి చెలామణి అవుతున్నారు. హైదరాబాదులో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్టు నకిలీ ఐడి కార్డ్ తయారు చేశారు.
అశ్విని ముగ్గురు యువకులను ప్రేమించారు. ప్రేమించిన వారిని చోరీలు చేసేలా నకిలీ మహిళా కానిస్టేబుల్ ఉసిగొల్పారు. పోలీస్ యూనిఫారం అడ్డం పెట్టుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని టోకరా చేశారు.
CEC Report : ధర్మపురి స్ట్రాంగ్ రూమ్.. కేంద్ర ఎన్నికల బృందం హైకోర్టుకు నివేదిక
అభిషేక్ అనే మరో యువకుడిని నకిలీ మహిళా కానిస్టేబుల్ ట్రాప్ చేశారు. తనను పెళ్లి చేసుకోవట్లేదని ఆసిఫ్ నగర్ పోలీసులకు నకిలీ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు.