హైదరాబాద్ లో రేషన్ కార్డుకి అప్లై చేసినా ఇంకా రాలేదా? ఇదే కారణం..!

సర్కిల్ అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, రేషన్‌కార్డు అర్హులను ఎంపిక చేస్తున్నామని అన్నారు.

హైదరాబాద్ లో రేషన్ కార్డుకి అప్లై చేసినా ఇంకా రాలేదా? ఇదే కారణం..!

New Ration Cards

Updated On : August 26, 2025 / 6:36 PM IST

New Ration Cards: మీది హైదరాబాద్ జిల్లానా? రేషన్ కార్డుకు అప్లై చేశారా? ఇంకా రాలేదా? అయితే, త్వరలోనే అందే అవకాశం ఉంది.

హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ… కొత్త రేషన్ కార్డుల పంపిణీ వేగంగా జరుగుతోందని తెలిపారు.

ఇప్పటివరకు మొత్తం 78,294 కార్డుల పంపిణీ మొదలైందని, మరో 85,000 అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు.

సర్కిల్ అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, రేషన్‌కార్డు అర్హులను ఎంపిక చేస్తున్నామని అన్నారు.

ఇప్పటివరకు కార్డులు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వచ్చే నెల నుంచి కొత్త కార్డుదారులకు రేషన్ బియ్యంతో పాటు సరుకులు అందుతాయన్నారు. ( New Ration Cards)

Also Read: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుభవార్త.. డబ్బు ఆదా చేసుకోవచ్చు..

కొత్త రేషన్‌కార్డుల వివరాలు ఈ పాస్ యంత్రాల్లో రికార్డుల్లో ఉన్నాయని, నేరుగా షాపులకు వెళ్లి బియ్యం తీసుకోవచ్చని వివరించారు.

వానాకాలం కావడంతో జూన్‌లో 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇచ్చారు.

ఇప్పుడు సెప్టెంబర్ కోటా పంపిణీ చేస్తారు. హైదరాబాద్ జిల్లాలో 16 వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేసే అవకాశం ఉంది. రేషన్ కార్డుదారులకు ప్రత్యేక తెల్లటి చేతి సంచులను ఇవ్వనున్నారు.

వీటిని అభయహస్తం పథకం కింద డిజైన్ చేయించారు. వీటిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల గుర్తులను కూడా ముద్రించారు.