Prakash Raj : దేశంలో ‘సర్’ రద్దు చేయాలి.. జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలి..

Prakash Raj : దేశంలో ‘సర్’ను రద్దు చేయాలని, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం తప్పని పేర్కొంటూ ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు.

Prakash Raj

Prakash Raj : దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను రద్దు చేయాలని, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం తప్పని పేర్కొంటూ ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్ విధానంపై తీవ్రంగా స్పందించారు. ఈ ప్రక్రియ వల్ల దేశవ్యాప్తంగా ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. పలు నివేదికల ప్రకారం.. దాదాపు 13కోట్లకుపైగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించారని ఆయన ఆరోపించారు.

Also Read : Students Protesting In France : ఫ్రాన్స్‌లో విద్యార్థుల తిరుగుబాటు.. స్కూళ్లలో రణరంగం.. 500కుపైగా పాఠశాలలకు నిప్పు.. వందల మందికి గాయాలు..

ఎన్నికల కమిషన్ ఏర్పాటైన నాటి నుంచి ఓటర్‌ లిస్ట్‌లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇప్పుడు అప్‌డేట్ వర్షన్‌తో సర్‌ను ఇంత హడావుడిగా చేపట్టడం ఏంటి అని ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు. సర్‌పై ప్రజలకు ఏమాత్రం అవగాహన కల్పించలేదు. కర్ణాటకలో ఇంకా ఎన్నికల సమయం ఉంది. కాస్త లేటైనా సర్‌ను పర్ఫెక్ట్‌గా చేయాలని అడిగాం.. అయినా వినలేదు. సర్ సక్రమంగా జరిగిందా లేదా అన్నది వంద బూతుల్లో ఇన్వెస్టిగేషన్ చేద్దాం అన్నాం.. అయినా వినలేదని ప్రకాశ్ రాజ్ అన్నారు. కర్ణాటకలో జరిగిన తప్పిదాలను సీఎం కు వివరించా… వాళ్లు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలిపారు.

గోవాలో 72 ఓట్లు గల్లంతు అయినందుకు ఈఆర్ఓను సస్పెండ్ చేశారు. ఇద్దరు కమిషనర్ లు చెప్పింది భిన్నాభిప్రాయమా… ఒక్కడు జ్ఞానేశ్ చెప్పింది సరైందా అని ప్రకాశ్‌ రాజ్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల కమిషన్ యాప్ ఎందుకు మార్చాల్సి వచ్చిందని, హంతకుడు మర్డర్ చేసేటప్పుడు దొరకడు… సాక్షాలు తారుమారు చేసెటప్పుడు దొరుకుతాడని, ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ దొరికాడని ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్నారు. రాజకీయ పార్టీ లు తమ ఓటు ను మాత్రమే కాపాడుకుంటున్నాయి.. కానీ అందరివి కాదు. రాజకీయ పార్టీలు ఎందుకు దీనిపై పెద్దగా పోరాటం చేయడం లేదు..? బతికున్న మనిషిని చంపేస్తున్నారంటూ ప్రకాశ్ రాజ్ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు.

2018 లో నాకు 4 ఓట్లు ఉన్నాయని బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. నాకు నాలుగు చోట్ల ఓట్లు ఉన్నాయని 2019‌లో ఎన్నికల కమిషన్ పిలిచింది. తమిళనాడులో పనిచేసేటప్పుడు అక్కడ ఓటు ఉంది. ఆ తరువాత సొంత ఊరిలోకి మార్చాను. తిరిగి ఫామ్ 7 సమర్పించాను.. బెంగళూరుకి నా ఓటు మారిందని ప్రకాశ్ అన్నారు. ప్రస్తుతం.. సర్ ప్రక్రియ ద్వారా తొలగించిన 13కోట్ల మంది ఓటర్లను మళ్లీ జాబితాలో చేర్చాలని, పాత ఓటర్ల జాబితాను యథాతథంగా కొనసాగించాలని, ఎన్నికల సంఘం అధికారుల ఎంపిక విధానం ఆగాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు.