Shikha Goel
Nampally Fire Accident: హైదరాబాద్‌లోని నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దీనిపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ మీడియాకు వివరాలు తెలిపారు.
“ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఉదయం 10.08 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. సీఐ శ్రీనివాస్ రెడ్డికి ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సమాచారం అందించారు. ఘటనాస్థలికి ఉదయం 10.30 గంటలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. ఏసీబీకి సంబంధించిన 2015 సంవత్సర కేసులో 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయి.
Also Read: ఈ వారం రాశిఫలాలు (ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు).. ఈ రాశివారికి ధనలాభం, ఈ పని చేస్తే సరి..
కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021లోనే ఏసీబీ కోర్టులో పొందపరిచాం. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చింది. ఇక్కడ ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయి. కేసుకు సంబంధించిన ఆధారాలకు ఎలాంటి నష్టం లేదు.
ఓటుకు నోటు కేసు యథావిధిగా నడుస్తుంది. 2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషనుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్‌కు వచ్చాయి. మిగతా మెటీరియల్స్ అసిస్ట్ చేసాం. ప్రమాదం జరిగినప్పుడు అందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి. వీటిని రిట్రీవ్ చేస్తాం. ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఎంత వరకు ఎంత నష్టం జరిగిందనేదానిపై స్పష్టత లేదు” అని అన్నారు.