ఈ వారం రాశిఫలాలు (ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు).. ఈ రాశివారికి ధనలాభం, ఈ పని చేస్తే సరి..
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..
Zodiac Signs Horoscope Predictions (Image Credit To Original Source)
ఈ వారం రాశిఫలాలు
ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు
గురువు మిధున రాశిలో వక్రగతి
శని మీన రాశిలో
రాహుకేతువులు కుంభ, సింహ రాశులలో
కుజుడు మకర రాశిలో
కుజ రాహు బుధులు కుంభరాశిలో
చంద్రుడు తులా, వృశ్చికం, ధనస్సు రాశులలో సంచారం
ఈ వారంలో త్రిగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి ఏర్పడింది
మేష రాశి: సన్నిహితులతో విందువినోదాలలో పాల్గొంటారు. మిశ్రమ ఫలితములు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితములు. ముఖ్యమైన వ్యవహారములో అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వృథా ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఏకాగ్రతతతో చిత్తశుద్ధితో పని చేస్తే అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఇష్టాదేవతారాధన వల్ల శుభఫలితములు కలుగుతాయి.
వృషభ రాశి: ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అపజయములు రావడం వల్ల విచారంగా ఉంటారు. వృత్తి ఉద్యోగములలో కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు. అనారోగ్యం కారణంగా ఈ రోజు మొదలు పెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. వృథా ఖర్చులు, వాహన ప్రమాదములు విషయంలో జాగ్రత్త. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో గండాలు తొలగిపోతాయి.
మిధున రాశి: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తి గతంగా మీ సన్నిహితులతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు, మీ ప్రయత్నములు ఫలిస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగు అవుతుంది. పొదుపు పాటించుతారు, సరియైన ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. లాభదాయకమైన సంస్థలలో పెట్టుబడులు పెట్టడం వలన అధిక లాభములు కలుగుతాయి. శివారాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితములు పొందుతారు.
కర్కాటక రాశి: ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది. అదృష్టం వరించి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. మిత్రులతో విహారయాత్ర, తీర్థయాత్రకు ప్రణాళిక వేస్తారు. పిత్రార్జితం కలసివస్తుంది. శ్రేయోభిలాషుల మద్దతు మీ వైపు ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. శ్రీలక్ష్మీ ధ్యానం వలన శుభ ఫలితములు కలుగుతాయి.
సింహ రాశి: ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది, వృత్తిపరంగా గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముకి లభిస్తుంది, సామాజికంగా సమస్యలు తొలగిపోతాయి, వ్యాపారులకు రుణ భారం, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, అవసరానికి ధనం చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దృఢపడుతాయి, ప్రయాణములు చేయడం. శివాలయ సందర్శన చేయటం వల్ల శుభం కలుగుతుంది.
కన్యా రాశి: ఈ రోజు శుభకరంగా ఉంటుంది, సామాజింకంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతాయి, కోపం, ఆవేశం పెరుగుతుంది, అవసరానికి ధనం చేతికి అందుతుంది, కుటుంబంలో ప్రశాంత వాతావారణం ఉంటుంది, చేసే ప్రతిపనిలో విజయం వెన్నంటే ఉంటుంది, ఆరోగ్యం సహకరిస్తుంది, కీలక నిర్ణయములు తీసుకుంటారు, మాతృవర్గం నుంచి అందిన శుభవార్తలు మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదభరితం చేస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల శుభం జరుగును.
తులా రాశి: వృథా ప్రయాణములు, సమస్యలు, ఆవేశం, వ్యాపారంలో లాభములు, ఆకస్మిక ప్రయాణములు, నూతన వస్త్రములు, విలువైన ఆభరములు కొనుగోలు, పనులలో ఆలస్యము. ఇష్టదైవ ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
వృశ్చిక రాశి: అకస్మిక ధనలాభం, నూతన ఆలోచనలు, నూతన వ్యాపారములు, తీర్థయాత్రలు, శుభకార్య నిర్వాహణ, ప్రతి దానిలో విజయం, అధికారుల ఒత్తిడి, అనారోగ్యము విద్యార్థులకు అనుకూలము. దత్తాత్రేయ స్తోత్రపారాయణం చేయటం వల్ల శుభం కలుగుతుంది.
దనుస్సు: ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుంచి మంచి సహాయసహకారములు లభిస్తాయి. ఇష్ట దేవతా ఆరాధన వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి.
మకర రాశి: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సోదరులు, రక్త సంబందీకులతో అనుబంధం దృఢ పడుతుంది. కుటుంబ సభ్యులతో తీర్థ యాత్రలకు వెళ్లడం. విదేశాల నుంచి మంచివార్తలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంబంధమైన అంశాలలో
అనుకూలత ఉంటుంది. శ్రీ రామనామ జపం వలన శుభం కలుగుతుంది.
కుంభ రాశి: భయం, నిర్ణయ లోపము, కాలయాపన, కీర్తి నాశనం, మానసిక ఒత్తిడి పెరగడం, బంధు మిత్రుల సహకారముతో కార్య విజయము. ఆరోగ్యం, ధనలాభం, పుణ్యకార్యములు, కార్యసిద్ధి, దైవభక్తి పెరుగుతుంది. విధ్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం, శుభకార్య ప్రయత్నములు ఫలిస్తాయి. రుద్రాభిషేకం, శివాలయములోలో దీపతైల సమర్పణ, విశ్వనాధాష్టకం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
మీన రాశి: శుభకార్యముల్లో ధనవ్యయం, మనో విచారము, శ్రమ అధికము, గౌరవం తగ్గడం, ధననష్టం, ప్రభుత్వ అధికార భయములు, పనుల్లో ఆటంకములు. అకాల భోజనం, వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. గృహనిర్మాణ పనులు లాభిస్తాయి. ఆంజనేయ దండకం పఠించ టం వల్ల శుభఫలితములు కలుగుతాయి.

Brahma SRI DR Nayakanti Mallikarjuna Sharma
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956
