Fish Prasadam Distribution: చేప ప్రసాదం పంపిణీ తేదీలు ఖరారు.. ప్రభుత్వం తరఫున విస్తృత ఏర్పాట్లు.. లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా!

మృగశిర కార్తెను పురస్కరించుకుని నిర్వహించే ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీ(Fish Prasadam Distribution) కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని రకాల విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది.

Fish Prasadam Distribution begin in Telangana from June 8th

  • జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
  • మూడు లక్షల చేపపిల్లలు పూర్తి సిద్ధం
  • భక్తులకు ఇబ్బంది లేకుండా భారీ ఏర్పాట్లు

Fish Prasadam Distribution: మృగశిర కార్తెను పురస్కరించుకుని నిర్వహించే ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని రకాల విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభం(Fish Prasadam Distribution) కానున్న ఈ పంపిణీ, జూన్ 9వ తేదీ సాయంత్రం వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. ఈ కార్యక్రమం పూర్తిగా ప్రజల నమ్మకం, విశ్వాసంతో ముడిపడి ఉందని.. ఎలాంటి ప్రచారాలు చేయకపోయినా దేశం నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి వెల్లడించారు.

Niger Desert Tragedy: సహారా ఎడారిలో మృత్యుఘోష.. దాహంతో 49 మంది మృతి.. గుండెలను పిండేసే నైగర్ ఎడారి విషాద కథ

ఈ ఏడాది లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మూడు లక్షలకు పైగా చేపపిల్లలను సిద్ధం చేశారు. గత సంవత్సరాల కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు. క్యూలైన్లలో ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రసాదం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, భక్తులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా నమ్మకంతో రావాలని స్పష్టం చేశారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 200 మందికి పైగా మత్స్యశాఖ సిబ్బంది నిరంతరం సేవలు అందించనున్నారు. ఎండ తీవ్రత, రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వసతి సౌకర్యాలను కల్పించారు. శాస్త్రానికి అంతుచిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయని, ప్రసాదం వల్ల లబ్ధి పొందిన వారే దీనికి నిజమైన ప్రచారకులని పేర్కొంటూ.. భక్తులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.