Pilot Rohith Reddy: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్.. అసైన్డ్ భూముల్లో ఫామ్‌హౌస్..!

సర్వే నెంబర్ 177/33 అజీజ్ నగర్ లో ఉన్న 2 ఎకరాల 20 సెంట్ల అసైన్డ్ భూమిలో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.

  • Published On : March 21, 2026 / 06:42 PM IST

Representative Image (Image Credit To Original Source)

  • పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో రెవెన్యూ అధికారుల సర్వే
  • అసైన్డ్ భూమిలో ఫామ్ హౌస్ నిర్మాణం చేసినట్లు గుర్తింపు
  • రిపోర్టు సిద్ధం చేసిన అధికారులు

 

Pilot Rohith Reddy: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ ను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపణలు రావడంతో అధికారులు సర్వే చేపట్టారు. ఇప్పటికే పోలీసుల నుంచి లేఖ రాగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో సర్వే చేపట్టారు అధికారులు.

సర్వే నెంబర్ 177/33 అజీజ్ నగర్ లో ఉన్న 2 ఎకరాల 20 సెంట్ల అసైన్డ్ భూమిలో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. 2006లో పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తేల్చి చెప్పారు. కానీ భూ భారతిలో జంగయ్య అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు తెలిపారు రెవెన్యూ అధికారులు. ఈ సర్వే రిపోర్ట్ ను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.

మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వ్యవహారంలో ఒకవైపు డ్రగ్స్ కేసులో పోలీసులు, సిట్ అధికారులు దర్యాఫ్తు కొనసాగిస్తోంది. మరోవైపు కొంత కాలంగా ఈ ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్ హౌస్ వ్యవహారంలో పోలీసులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల లేఖతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఫామ్ హౌస్ ను సర్వే చేశారు. ఈ సర్వేలో ఫామ్ హౌస్ కు సంబంధించి మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. అసైన్డ్ ల్యాండ్ లో ఫామ్ హౌస్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. నిన్న సాయంత్రం రెవెన్యూ అధికారుల సర్వే పూర్తైంది. దీనికి సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేయనున్నారు.

వీకెండ్స్ లో ఈ ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఫామ్ హౌస్ కు సంబంధించిన కబ్జా బాగోతం, అసైన్డ్ ల్యాండ్ లో అక్రమ నిర్మాణం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read: దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడు..! మంత్రులతో జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. బుజ్జగింపుల చర్చలు విఫలం..!