Jeevan Reddy: దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడు..! మంత్రులతో జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. బుజ్జగింపుల చర్చలు విఫలం..!
మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ దాదాపు 2 గంటల పాటు జీవన్ రెడ్డితో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
- జీవన్ రెడ్డితో మంత్రుల చర్చలు
- పార్టీ మారొద్దని జీవన్ రెడ్డికి విజ్ఞప్తి
- తన నిర్ణయంలో మార్పు ఉండదన్న జీవన్ రెడ్డి
- ఈ నెల 25న అనుచరులతో చర్చలు, భవిష్యత్తుపై నిర్ణయం
Jeevan Reddy: పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ బుజ్జగింపులు చేసినా డోంట్ కేర్ అంటున్నారు. జీవన్ రెడ్డితో మంత్రులు జరిపిన చర్చలు విఫలం అయినట్లుగా తెలుస్తోంది. మంత్రులు ఎంత నచ్చజెప్పినా జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడు అంటూ డైలాగ్ చెప్పారు జీవన్ రెడ్డి.
తాను ముందుగా అనుకున్నట్లుగానే ఈ నెల 25న అనుచరులతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు మరోసారి ప్రకటించారు జీవన్ రెడ్డి. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ దాదాపు 2 గంటల పాటు జీవన్ రెడ్డితో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. తీవ్ర అసంతృప్తికి గురైన ఆయనతో అన్ని అంశాలు చర్చించామని, పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. 45ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన జీవన్ రెడ్డికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ మార్పు నిర్ణయాన్ని మార్చుకోవాలని జీవన్ రెడ్డిని కోరినట్లుగా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
”పార్టీ మారొద్దని జీవన్ రెడ్డిని కోరాం. జీవన్ రెడ్డి బాధపడితే మేం బాధ పడినట్లే. మా భేటీ అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం. ఉమ్మడి కరీంనగర్ ప్రాంతానికి జీవన్ రెడ్డి పెద్ద దిక్కు” అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
Also Read: అన్నదో రాగం.. తమ్ముడిది ఇంకో రాగం..! కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా కోమటిరెడ్డి బ్రదర్స్ తీరు
