Metro: హైదరాబాద్‌ మెట్రోకు గుడ్‌న్యూస్‌

హైదరాబాద్ మెట్రోలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్‌ఐఐఎఫ్‌ఎల్‌ సంస్థ ముందుకు వచ్చింది. రూ.4 వేలకోట్లు పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

Metro

Metro: హైదరాబాద్ మెట్రోనష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. రోజుకు సుమారు ఐదు కోట్ల మేర నష్టం వస్తుంది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు మెట్రో యాజమాన్యం తీవ్రంగా కృషి చేస్తుంది. ప్రయాణికుల కోసం ఆఫర్లను తీసుకొస్తుంది. అయినా నష్టాలు పూడేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే చాలామంది ఉద్యోగులను కూడా తొలగించింది.

ఇక మెట్రో స్టేషన్లలో షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేసింది. అయినా ఆశించినంత ఆదాయం రావడం లేదు. ఎన్నో అంచనాలతో ప్రారంభమైన మెట్రో.. అంచనాలను అందుకుంది కానీ ఆర్ధికంగా నిలదొక్కుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే స్టాఫ్ రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంది.

ఇక ఈ నేపథ్యంలోనే నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌ఎల్‌) సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నష్టాల్లో ఉన్న హైదరాబాద్ మెట్రోలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రూ.4వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. ఈ పెట్టుబడితో సంస్థల రుణ అవసరాలు కొంతమేర తీరినట్లే అవుతుంది. ఈ క్లిష్టపరిస్థితుల్లో ఎన్‌ఐఐఎఫ్‌ఎల్‌ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంతో మెట్రో యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తుంది.