హైదరాబాద్‌లో ఉచితంగా కొవిడ్ పరీక్షలు చేసే సెంటర్లు

కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వైరస్ తీవ్రత పెరుగుతుండగా ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు తీసుకుని ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో కేసులు ధారాళంగా పెరుగుతున్నాయి. వీటిని అదుపుచేసేందుకు కొవిడ్ పరీక్షలు ముమ్మరం చేశారు. వైద్య పరీక్షలు ఇప్పటికే ప్రైవేటీకరణ చేసినప్పటికీ సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఉచితంగా టెస్టింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు.

గతంలో సికింద్రాబాద్ పరిధిలో గాంధీ హాస్పిటల్ లో మాత్రమే నిర్వహించే వైద్యపరీక్షలు ఇప్పుడు నగరంలో 11చోట్ల ఉచితంగా నిర్వహిస్తున్నారు. వాటిలో ప్రాంతాలకు దగ్గరల్లో సెంటర్ల వివరాలిలా ఉన్నాయి.

1. కోటీలో – కింగ్ కోటి హాస్పిటల్
2. నల్లకుంటలో – ఫీవర్ హాస్పిటల్
3. ఎర్రగడ్డ – చెస్ట్ హాస్పిటల్
4. అమీర్‌పేట్ – నేచుర్ క్యూర్ హాస్పిటల్
5. మెహిదీపట్నం – సరోజినీ దేవీ కంటి హాస్పిటల్
6. ఎర్రగడ్డ – ఆయుర్వేదిక్ హాస్పిటల్
7. రామంతపూర్ – హోమియోపతి హాస్పిటల్
8. చార్మినార్ – నిజామియా తిబ్బి హాస్పిటల్
9. కొండాపూర్ – ఏరియా హాస్పిటల్
10. వనస్థలిపురం – ఏరియా హాస్పిటల్
11. నాచారం – ఈఎస్ఐ హాస్పిటల్

ఇవి ఉచితంగా వైద్య పరక్షీు చేసే కేంద్రాలు కాగా, మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబొరేటరీల్లోనూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవి కూడా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులనే టెస్టులకు వసూలు చేస్తున్నారు.