Congress Leader: తెలంగాణలో ఓ కాంగ్రెస్ లీడర్ హల్‌చల్.. ఆ నేతను ప్రసన్నం చేసుకునేందుకు లీడర్ల ప్రయత్నం.. ఆయన చుట్టే పోలీస్ బాస్‌లు..
సదరు నేత మొదటి నుంచి కాస్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండటంతో.. ఇప్పుడు భూ వ్యవహారాల్లో పోలీస్ బాస్‌లు ఆయనకు పూర్తిగా సహకరిస్తూ.. ఆ నేతకు అండదండలు అందిస్తున్నారట.

Congress Leader
Congress Leader: ఇటు తెలంగాణ పాలిటిక్స్‌లో, అటు అధికార వర్గాల్లో ఆ నేత పేరు చెప్తే చాలు ఓ వైబ్రేషన్ అట. పనేదైనా అందరి నోట భాయ్ భాయ్ అంటూ కలవరింతేనట. పనేదైనా ఆ నేత చెప్పిందే వేదమట. సదరు నేతను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ బడా లీడర్లే కాదు..పోలీస్ బాస్‌లు, అధికారగణం కూడా క్యూ కడుతున్నారట. పోలీస్ పోస్టింగ్‌ల్లో కీలకంగా చక్రం తిప్పే ఆ నేత తలుచుకుంటే ఎవరికి ఏ పోస్టు అయినా ఇట్టే దక్కుస్తుందట.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక నేత పేరు గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి సదరు నేత పేరు కూడా ఎవరూ విని ఉండరు. అసలు అతను కాంగ్రెస్ లీడర్ అని కూడా చాలామందికి తెలీదు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన జోక్యం చేసుకుంటే తప్ప కొన్ని ఫైళ్లు కదలడం లేదట. ప్రభుత్వంలో ఉన్నది చిన్న పదవే అయినా.. ప్రభుత్వ పెద్దలకు మాత్రం అత్యంత సన్నిహితుడిగా పేరుండటంతో ఆయన మాటే వేదంగా సాగుతోందట.
అందుకే ఆ నేతను ప్రసన్నం చేసుకోవడానికి అటు రాజకీయవర్గాలతో పాటు ఇటు ప్రభుత్వంలోని ముఖ్య అధికారులు..ప్రధానంగా పోలీస్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులు తాపత్రయపడుతున్నారట. Congress Leader
హైదరాబాద్ చుట్టు పక్కల అత్యంత విలువైన భూములున్న విభాగం కూడా సదరు నేత కనుసన్నల్లోనే నడుస్తోందట. ఆ విభాగానికి ప్రత్యేకంగా ఒక ఛైర్మన్ ఉన్నా… ఆ శాఖ అధికారులంతా కూడా ఛైర్మన్‌ను కాదని ఈ నేత మాటకే విలువిస్తారట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కీలకమైన విభాగంలో ప్రతీ మూమెంట్ సార్ కనుసన్నల్లోనే ఉంటుందట.
ఈ విషయంలో సదరు ఛైర్మన్ కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్లి గోడును వెళ్లబోసుకున్నారట. కానీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదంటున్నారు. ఇక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ వేదికగా చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఆ నేతే కీరోల్ ప్లే చేస్తున్నారట.
సదరు నేతను ప్రసన్నం చేసుకుంటే సరి..
ఇక ఇప్పుడు మరో అంశం తెరపైకి రావడంతో అటు రాజకీయవర్గాల్లో.. ఇటు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా పోలీస్ శాఖలో సదరు నేత తలదూర్చుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. పోలీస్ శాఖలో కీలకమైన పోస్టుల్లో ఉన్న వ్యక్తులను తన చుట్టూ తిప్పుకునేలా చేస్తున్నారట. పోలీస్ ఆఫీసర్స్‌కు కీలకమైన పోస్టింగ్‌లు రావాలన్నా..పోలీస్ బాసులకు అండదండలు కావాలన్నా సదరు నేతను ప్రసన్నం చేసుకుంటే ఇట్టే జరిగిపోతుందట.
అందుకే హైదరాబాద్ చుట్టూ ఉన్న కమిషనరేట్ పరిధిలోని ఓ ముగ్గురు డీసీపీలు తరచూ సదరు నేతతో టచ్ ఉంటూ ఆయన చెప్పినట్లే పనులు చేసి పెడుతున్నారట. అంతేకాదు సదరు నేత మొదటి నుంచి కాస్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండటంతో.. ఇప్పుడు భూ వ్యవహారాల్లో పోలీస్ బాస్‌లు ఆయనకు పూర్తిగా సహకరిస్తూ.. ఆ నేతకు అండదండలు అందిస్తున్నారట.
అంతేకాదు ఇటీవల గ్రేటర్ లో ఓ జూనియర్ ఐఏఎస్‌కు తన సీనియర్ అధికారికన్నా పైస్థాయి పోస్టు దక్కడంలో కూడా ఈ భాయ్ దే కీలక పాత్ర అట. ఇలా భాయ్ చెప్తే ఏదైనా చేస్తాం అనేలా ఆయన అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడం అటు కాంగ్రెస్ నేతల్లోనూ..ఇటు అధికార యంత్రాంగంలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే ఓ ఇష్యూలో ఆ నేత పేరు తెరమీదకు వచ్చి రచ్చరంబోలా అయింది. ఇప్పుడు మరో ఇష్యూతోనైనా సదరు లీడర్ సైలెంట్ అవుతారా..ప్రభుత్వ పెద్దల అండతో ఇలాగే దూకుడుగానే ఉంటారా అనేది చూడాలి మరి.