Mega Job Mela: రేపే మెగా జాబ్ మేళా: 21 కంపెనీలు, 1442 ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవకండి

ఏపీలో భారీ జాబ్ మేళా జరుగనుంది. కాకినాడ జిల్లా తుని బాలికల(Mega Job Mela) ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 7వ తేదీ జాబ్‌ మేళా జరగనుంది.

Mega Job Mela: రేపే మెగా జాబ్ మేళా: 21 కంపెనీలు, 1442 ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవకండి

a mega job mela will be held in kakinada district on september 7th

Updated On : September 7, 2025 / 11:47 AM IST

Mega Job Mela: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. ఏపీలో భారీ జాబ్ మేళా జరుగనుంది. కాకినాడ జిల్లా తుని బాలికల ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 7వ తేదీ అంటే రేపే ఈ మెగా జాబ్‌ మేళా జరగనుంది. ఈ జాబ్‌మేళాలో మొత్తం 21 కంపెనీలు పాల్గొని దాదాపు 1442 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి(Mega Job Mela). కాబట్టి, ఆసక్తిగల అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ జాబ్ మేళా గురించి మరింత సమాచారం కోసం 9949156583 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

TG CPGET 2025: టీజీ సీపీగెట్ 2025: ఫలితాలు విడుదల.. మీ ఫలితాలు ఇలా తెలుసుకోండి

సంస్థలు, ఖాళీల వివరాలు:

* వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ పోస్టులు 13

* ఎంసీవీ మోటో కార్ప్ పోస్టులు 3

* స్విగ్గీ పోస్టులు 100

* బ్లింకిట్ పోస్టులు 100

* సోలార్ పవర్ ఏజెన్సీలు పోస్టులు 12

* మహీంద్రా పోస్టులు 16

* మెడ్‌ప్లస్ ఫార్మసీ పోస్టులు 40

* అపోలో ఫార్మసీ పోస్టులు 50

* భారత ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్ పోస్టులు 100

* హెల్త్ కేర్ ఇండస్ట్రీ పోస్టులు 125

* PNB మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ పోస్టులు 50

* కాన్‌సెంట్రిక్స్ డాక్ష్ సర్వీసెస్ పోస్టులు 50

* టాటా ఎలక్ట్రానిక్స్ పోస్టులు 60

* SBI లైఫ్ ఇన్సూరెన్స్ పోస్టులు 100

* ఇన్నోవ్‌సోర్స్ సర్వీసెస్ పోస్టులు 100

* 2050 హెల్త్ కేర్ పోస్టులు 125

* ముత్తూట్ ఫైనాన్స్ పోస్టులు 50

* టీమ్‌లీజ్ పోస్టులు 100

* మెగా బైట్ ఐటీ సొల్యూషన్స్ పోస్టులు 10

* డివిస్ పోస్టులు 100

* ఔరోబిందో ఫార్మా లిమిటెడ్ పోస్టులు 100