TG CPGET 2025: టీజీ సీపీగెట్ 2025: ఫలితాలు విడుదల.. మీ ఫలితాలు ఇలా తెలుసుకోండి
తెలంగాణాల రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాల కోసం టీజీ సీపీగెట్ 2025(TG CPGET 2025) ఎగ్జామ్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే.

TG CPGET 2025 results released
TG CPGET 2025: తెలంగాణాల రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాల కోసం టీజీ సీపీగెట్ 2025 ఎగ్జామ్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. వీటికి సంబందించిన ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన ప్రకారం రేపు అంటే సెప్టెంబర్ 8న ఫలితాలు అందుబాటులో రానున్నాయి. ఇక అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://cpget.tgche.ac.in/ నుంచి ఫలితాలను తెలుసుకోవచ్చు. అభ్యర్థులు సాధించిన(TG CPGET 2025) ర్యాంకుల ఆధారంగా పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కలించనున్నారు అధికారులు.
AP LawCET 2025: ఏపీ లాసెట్ 2025: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు
మీ ఫలితాలను ఇలా తెలుసుకోండి:
* ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://cpget.tgche.ac.in/ లోకి వెళ్లాలి.
* హోం పేజీలో డౌన్లోడ్ ర్యాంక్ కార్డు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
* తరువాత వ్యూ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయాలి
* ఫలితాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.
* దానిని తరువాత అవసరాల కోసం ప్రింట్/ డౌన్లోడ్ చేసుకోవాలి.