AP LawCET 2025: ఏపీ లాసెట్ 2025: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ లోని లా కాలేజీలలో ప్రవేశాల కోసం(AP LawCET 2025) ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలు కూడా విడుదల అయ్యాయి.

AP Law Set 2025 Counseling Schedule Released
AP LawCET 2025: ఆంధ్రప్రదేశ్ లోని లా కాలేజీలలో ప్రవేశాల కోసం ఇటీవల ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. ఇందులో భాగంగానే తాజాగా దీనికి సంబందించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. షెడ్యూల్ ప్రకారం(AP LawCET 2025) సెప్టెంబర్ 8వ తేదీ అంటే రేపటినుండి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. కాబట్టి, అర్హత సాధించిన అభ్యర్థులు తగిన ధ్రువపత్రాలతో కౌన్సిలింగ్ కోసం సిద్ధంగా ఉండాలి.
ఏపీ లా సెట్ 2025 కౌన్సిలింగ్ ముఖ్యమైన తేదీలు:
* సెప్టెంబర్ 8 నుంచి 11: రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతింది.
* సెప్టెంబర్ 9 నుంచి 12: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది
* సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు: కాలేజీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
* సెప్టెంబర్ 15: వెబ్ ఆప్షన్లను ఎడిటింగ్ ఆప్షన్
* సెప్టెంబర్ 17: సీట్ల కేటాయింపు ఉంటుంది.
* సెప్టెంబర్ 19: అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవచ్చు.