CANARA Bank Recruitment: కెనరా బ్యాంక్ బంపర్ ఆఫర్: డిగ్రీ అర్హతతో ట్రెయినీ జాబ్స్.. దరఖాస్తు, పూర్తి వివరాలు

డిగ్రీ పూర్తి చేసి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన(CANARA Bank Recruitment) అవకాశం మీకోసమే.

CANARA Bank Recruitment: కెనరా బ్యాంక్ బంపర్ ఆఫర్: డిగ్రీ అర్హతతో ట్రెయినీ జాబ్స్.. దరఖాస్తు, పూర్తి వివరాలు

Canara Bank Recruitment: Canara Bank has released a notification for trainee posts.

Updated On : September 7, 2025 / 10:16 AM IST

CANARA Bank Recruitment: డిగ్రీ పూర్తి చేసి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. కెనరా బ్యాంక్ ట్రెయినీ (సేల్స్ అండ్ మార్కెటింగ్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా అక్టోబర్ 6వ తేదీతో ముగియనుంది(CANARA Bank Recruitment). కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://canarabank.com/pages/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. అయితే ట్రెయినీల కోసం వివిధ ప్రాంతాల్లోని సెంటర్లలో నియమించడం జరుగుతుంది. ఆ వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.

IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 455 ఉద్యోగాలు.. నెలకు రూ.69 వేల జీతం.. దరఖాస్తు, పూర్తి వివరాలు

విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:
అభ్యర్థుల వయసు ఆగస్టు 31, 2025 నాటికి 20 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

అనుభవం, ప్రధాన్యత:
మార్కెటింగ్, సేల్స్ విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు తగిన ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
ది జనరల్ మేనేజర్, హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్,
కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్,
7వ అంతస్తు, మేకర్ ఛాంబర్ III, నారిమన్ పాయింట్,
ముంబై-400021.

అవసరమయ్యే ధ్రువపత్రాలు:

  • జనన ధృవీకరణ పత్రం / ఎస్ఎస్‌సీ / ఎస్‌ఎస్‌ఎల్‌సీ సర్టిఫికేట్.
  • అప్‌డేటెడ్ రెజ్యూమ్.
  • విద్యార్హత మార్కుషీట్లు, సర్టిఫికేట్‌ల కాపీలు.
  • అనుభవ ధృవీకరణ పత్రాలు.

ఎంపిక విధానం:
ఈ పోస్టులకు అభ్యర్థులనుకేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.