Hyderabad: మాట్లాడుకుందాం అని పిలిచి.. కత్తులతో పొడిచి.. హైదరాబాద్ లో దారుణం
హైదరాబాద్ (Hyderabad)బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్నేహితుల మధ్య తలెత్తిన మనస్పర్థలు ఒక యువకుడి దారుణ హత్యకు దారితీశాయి.
- V Santhosh Kumar
- Updated on- July 7, 2026 / 07:30 AM IST
Friends kill a young man in Pahadishareef Hyderabad
- స్నేహితుల చేతిలో యువకుడి హత్య
- కత్తులతో విచక్షణా రహితంగా దాడి
- బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి
Hyderabad: హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్నేహితుల మధ్య తలెత్తిన మనస్పర్థలు ఒక యువకుడి దారుణ హత్యకు దారితీశాయి. బార్కాస్ సలాల ప్రాంతానికి చెందిన ఫహద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బాల్కషర్ (29) అనే యువకుడు జిమ్ కోచ్‌గా, మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అదే ప్రాంతానికి చెందిన అతని స్నేహితులు సయీద్ బిన్ ఫైసల్ బామ్, సాలం బామ్‌లతో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వివాదాన్ని పరిష్కరించుకుందామంటూ సోమవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఫహద్‌ను నిందితులు మరియం కాలనీకి పిలిపించారు.
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరికలు
అక్కడికి చేరుకున్న తర్వాత వారి మధ్య మాటామాటా పెరిగి వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో ముందస్తు పథకం ప్రకారం తమతో(Hyderabad) తెచ్చుకున్న కత్తులతో నిందితులు ఫహద్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి, తీవ్రంగా పొడిచి అక్కడి నుండి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు, కొన ఊపిరితో ఉన్న ఫహద్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘోర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
