Hyderabad Traffic Diversion : కేబీఆర్ పార్కు చుట్టూ వన్-వే అమల్లోకి.. ఈ ప్రాంతాలకు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే..
Hyderabad Traffic Diversion : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
Hyderabad Traffic Diversion
Hyderabad Traffic Diversion : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పార్కు చుట్టూ అండర్ పాస్ ప్లైఓవర్ల నిర్మాణం నేపథ్యంలో వన్-వే అమల్లోకి తీసుకొచ్చారు. అండర్ పాస్ ప్లైఓవర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు వన్-వే అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. దాదాపు రెండేళ్ల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి ఉంటాయని చెప్పారు.
Also Read : CM Revanth Reddy : నల్లమలకు వెళ్లి అలా చేయండి.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సూచన.. కేటీఆర్‌పై కీలక కామెంట్స్..
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న H-CITI ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు, కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీల వన్ వే అమలులో ఉంటుంది. వాహనదారులు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను గమనించి నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే లేన్ మారాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
నిర్ణీత మార్గాలు, ఫ్రీ-లెఫ్ట్ సదుపాయాలను వినియోగించుకోవాలని, రాంగ్-సైడ్ డ్రైవింగ్ చేయవద్దని, ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయంలో అతివేగంతో ప్రయాణించవద్దని, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ సూచించారు.
వాహనదారులు ఇబ్బందులు పడకుండా వన్-వే లూప్ నుంచి బయటకు వెళ్లి ఇతర ప్రధాన రహదారుల్లోకి ప్రవేశించడానికి 13 ఎగ్జిట్ పాయింట్లు, 10 లైన్ఛేంజర్లను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రయాణించేటప్పుడు దారి మారడానికి కేవలం ఈ 10 ప్రాంతాల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. పార్కు చుట్టూ నిర్దిష్ట యూ-టర్న్‌లు, ఎగ్జిట్ పాయింట్లతో కూడిన కొత్త వన్ -వే రూట్ మ్యాప్‌ను గూగుల్ మ్యాప్స్‌లో సవరించారు. ప్రయాణానికి ముందు గూగుల్ మ్యాప్స్ ద్వారా సరిచూసుకొని వాహనదారులు వెళ్లాల్సిన ప్రాంతాలకు చేరుకోచవచ్చు.
#HYDTPinfo
🚨 కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం 🚨
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న H-CITI ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు, కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే (ఏకదిశా) ట్రాఫిక్ విధానం అమలు చేయబడుతోంది.📅 అమలు తేదీ: 18.08.2026
⏰ సమయం: ఉదయం… pic.twitter.com/m423DUu37v— Hyderabad Traffic Police (@HYDTP) August 17, 2026
