Firewood blower Stove : గ్యాస్ అయిపోయిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి.. గ్యాస్ ఇబ్బందులకు చెక్..!

Firewood blower Stove : కమర్షియల్ గ్యాస్ సరఫరా విషయంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో హోటల్, మెస్, క్యాంటీన్, హాస్టళ్ల నిర్వాహకులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా పలువురు ఫైర్ ఉడ్ బ్లోయర్ స్టవ్ ల వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Firewood blower Stove

  • ఇరాన్, ఇజ్రాయెల్ వార్.. పెరుగుతున్న గ్యాస్ కష్టాలు
  • తీవ్రమైన కమర్షియల్ సిలీండర్ గ్యాస్ కొరత
  • ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిన హోటళ్ల నిర్వాహకులు

Firewood blower Stove : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ వార్ కారణంగా భారతదేశంలో LPG సిలీండర్ ధరలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో పలు నగరాల్లో కమర్షియల్ సిలిండర్లు కొరతతో హోటళ్లు మూత పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి నెలకొంది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కమర్షియల్ సిలీండర్ల సరఫరా తగ్గిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు తమ హోటళ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు.

Also Read : LPG Shortage : గ్యాస్ కొరత ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో ప్రతి సోమవారం రెస్టారెంట్లు బంద్.. జొమాటో, స్విగ్గీ ఆర్డర్లూ క్లోజ్..!

కమర్షియల్ గ్యాస్ సరఫరా విషయంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో హోటల్, మెస్, క్యాంటీన్, హాస్టళ్ల నిర్వాహకులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా పలువురు ఫైర్ ఉడ్ బ్లోయర్ స్టవ్ ల వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నారు. సంప్రదాయ కట్టెల పొయ్యలకు ఈ ఫైర్ ఉడ్ బ్లోయర్ స్టవ్ లు ప్రత్యామ్నాయమని వ్యాపారులు చెబుతున్నారు.

సంప్రదాయ కట్టెల పొయ్యిల నుంచి పొగ అధికంగా వెలువడుతుంది. అంతేకాక.. మంటను అదుపు చేయడం సాధ్యం కాదు. కానీ, ఫైర్ ఉడ్ బ్లోయర్ స్టవ్‌లను మాత్రం గ్యాస్ స్టవ్‌ల మాదిరిగానే వినియోగించుకోవచ్చు. దీనికితోడు తక్కువ పొగ రావడంతోపాటు.. మంటను మనకు కావాల్సినంత స్థాయిలో సెట్ చేసుకునేందుకు వీలుంటుంది.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో పలువురు హోటళ్లను మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారికి ఈ ఫైర్ ఉడ్ బ్లోయర్ స్టవ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. టీ స్టాల్స్, కర్రీ పాయింట్లు, మెస్ లు, హాస్టల్స్, హోటళ్లు లాంటి చొట్ల ఇవి ఉపయోగపడతాయని వ్యాపారులు అంటున్నారు. కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడినప్పటి నుంచి చాలా మంది హోటళ్ల నిర్వాహకులు, హాస్టళ్ల నిర్వాహకులు, టీస్టాల్స్, కర్రీ పాయింట్ నిర్వాహకులు ఫైర్ ఉడ్ బ్లోయర్ స్టవ్ లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గత మూడు రోజులుగా వీటి అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

మార్కెట్లో ఈ ఫైర్ ఉడ్ బ్లోయర్ స్టవ్ లు అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ లోనూ వీటిని కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. ఒక్కోదాని ధర ఛార్జింగ్‌తో సహా రూ. 22వేల నుంచి సైజును, కంపెనీ బట్టి రూ.35వేల వరకు ఉంటుంది. కొందరు వ్యాపారులు రెండు లేదా మూడు స్టవ్ లను కొనుగోలు చేస్తున్నారని ఫైర్ ఉడ్ బ్లోయర్ స్టవ్ విక్రయదారులు పేర్కొంటున్నారు.