Engagement : డిగ్రీ పూర్తి కాలేదని నిశ్చితార్థం రద్దు చేసుకుంది ఓ యువతి. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వల్లాపురంకి చెందిన యువతి బీటెక్ చదువుకుంది. ఈర్లపుడిలోని భాగ్యాతండాకు చెందిన ఇక్బాల్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. అయితే మొదట ఆ యువకుడు డిగ్రీ పూర్తి చేశానని తెలిపాడు.
అయితే నిశ్చితార్ధం రోజు అతడు డిగ్రీ పూర్తి చెయ్యలేదని మధ్యలోనే ఆపేశాడని యువతికి తెలిసింది. దీంతో ఆమె నిశ్చితార్ధం రద్దు చేసుకుంది. ఈ సమయంలోనే ఇక్బాల్ బందువులకు, యువతి బందువులకు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో యువతి సోదరుడు జాన్పాషాకు తీవ్ర గాయాలయ్యాయి.