Goat : ఒకే ఈతలో ఒకటి లేదా రెండు మేక పిల్లలు జన్మించడం సర్వసాధారణం. మూడు ఆపైగా జన్మించడం చాలా అరుదు. కానీ ఓ మేక ఒకే ఈతలో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.
Goat Gave Birth : మనిషి ముఖంతో వింత జీవికి జన్మనిచ్చిన మేక
జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో ఓ మేక.. ఒకే ఈతలో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఐదు మేక పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు యజమాని మంతయ్య తెలిపారు. ఐదు మేక పిల్లలను చూసేందుకు గ్రామస్తులు మంతయ్య ఇంటికి చేరుకుంటున్నారు.