Gold Price Today: మహిళలకు ఇది శుభవార్తే.. మరోసారి తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. బంగారం 10 గ్రాములకు రూ.100, కిలో వెండి రూ. 600 వరకు తగ్గాయి. తగ్గిన ధరల తరువాత తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Price

Gold Rate In Hyderabad : బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయంలో మెండపై నిండుగా బంగారం ఉండాలని కోరుకుంటారు. దీంతో ఎలాంటి శుభకార్యమైనా బంగారం దుకాణాలకు పరుగెడుతారు. అయితే, గత నెల రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. తులం బంగారం రూ. 60వేలు దాటింది. దీంతో బంగారం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటం, దీనికితోడు మరికొద్దిరోజుల్లో పెండ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో బంగారం కొనుగోళ్లకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు.

Gold Rate

బుధవారం 10 గ్రాముల బంగారంపై రూ. 100 తగ్గగా.. గురువారంసైతం 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రూ. 100 తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 110 తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధర 22 క్యారెట్స్ (పది గ్రాములు) రూ. 54,950 కాగా, 24 క్యారెట్స్ (పది గ్రాముల) బంగారం ధర రూ. 59,950కు చేరింది.

Gold Rate

మరోవైపు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 77,300గా ఉండగా.. గురువారం రూ. 600 తగ్గి.. రూ. 76,700కు చేరింది. వెండి ధరలు గత మూడు రోజులుగా సుమారు రూ. 1800 తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 1వ తేదీన కిలో వెడి ధర రూ. 81,000 పలికింది.అ ప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 4,300 వరకు తగ్గింది.

Gold price in hyderabad

దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం (10 గ్రామాలు) ధరలు వివరాలు ఇలా ఉన్నాయి..

– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 55,100 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,110గా ఉంది.
– ముంబైలో 22 క్యారెట్స్ ధర రూ. 54,950 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 59,950గా ఉంది.
– చెన్నైలో 22 క్యారెట్స్ ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,330గా ఉంది.
– బెంగళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 54.950 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 59,950గా ఉంది.
– హైదరాబాద్‌, వరంగల్ ప్రాంతాల్లో 22 క్యారెట్స్ రూ. 54,950 కాగా, 24 క్యారెట్స్ రూ. 59,950గా ఉంది.
– విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో 22 క్యారెట్స్ ధర రూ. 54,950 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 59,950గా ఉంది.