×
Ad

Telangana Farmers : తెలంగాణలో రైతులకు భారీ శుభవార్త.. వారందరి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ.. ఇలా చెక్ చేసుకోండి..

Telangana Farmers : తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఊరట కల్పిస్తూ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది.

Telangana Farmers

Telangana Farmers : తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఊరట కల్పిస్తూ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాన్ని రైతుల ఖాతాల్లో అధికారులు జమ చేస్తున్నారు. దీంతో మొత్తం 55,904 మంది రైతులు లబ్ధి పొందనున్నారు.

Also Read : మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్‌, మాధురి.. ఫామ్‌హౌస్‌లో పార్టీ.. ఎస్‌వోటీ పోలీసుల దాడులు..

కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించనప్పటికీ రాష్ట్రంలోని రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని పంట సేకరణ చేపట్టింది. తాజాగా.. కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించిన మొత్తాన్ని సంబంధిత రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తు్ననట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం అధికారులకు ఆదేశాలు ఇవ్వగా.. శుక్రవారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ఇప్పటి వరకు 2.45లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించింది. సేకరించిన మొక్కలకు సంబంధించి రూ.588 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. వాటిని ప్రభుత్వం తాజాగా రైతులు ఖాతాల్లో జమ చేస్తోంది. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలనేది తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని మంత్రి తుమ్మల తెలిపారు. మొక్కజొన్న సేకరణకు సంబంధించిన మొత్తం ప్రక్రియను వేగవంతం చేయాలని, చెల్లింపుల్లో ఎటువంటి జాప్యం ఉండకూడదని అధికారులకు మంత్రి తుమ్మల ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వం పేర్కొన్నట్లు మొక్కజొన్న డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడినవెంటనే బ్యాంకు ఖాతాకు లింక్ అయిన ఫోన్ నెంబర్ కు మెస్సేజ్ వస్తుంది. అలా రానిపక్షంలో నేరుగా బ్యాంకు వద్దకు వెళ్లి మీ ఖాతాను చెక్ చేసుకోవచ్చు.