×
Ad

Raitu Bharosa : రైతులకు శుభవార్త.. ‘రైతు భరోసా’ డబ్బులు మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. లైన్‌క్లియర్.. కానీ..

Rythu Bharosa : యాసంగి సీజన్ ఎప్పుడో ప్రారంభమైంది. రైతులు వివిధ పంటలను సాగుచేసి ప్రభుత్వం అందించే రైతు భరోసా నగదు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం నగదు విడుదలలో

Rythu Bharosa scheme

  • తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్
  • ‘రైతు భరోసా’కు నిధులను సమీకరిస్తున్న ప్రభుత్వం
  • రైతుల ఖాతాల్లో జమచేసేందుకు అధికారుల కసరత్తు

Raitu Bharosa : రైతులకు పంటల సాగు ప్రారంభంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’  (Rythu Bharosa) పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖరీఫ్, యాసంగి సీజన్లలో రెండు విడతలుగా ఎకరానికి రూ.6వేలు చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి ఖరీఫ్ సీజన్‌కు డబ్బులు జమకాగా.. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.

Also Read : PM Kisan Yojana : కొత్త రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ కోసం అప్లయ్ చేశారా? 22వ విడత రూ. 2వేలు పడాలంటే ఇలా చేయండి..!

యాసంగి సీజన్ ఎప్పుడో ప్రారంభమైంది. రైతులు వివిధ పంటలను సాగుచేసి ప్రభుత్వం అందించే రైతు భరోసా నగదు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం నగదు విడుదలలో జాప్యం చేస్తూ వస్తోంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈక్రమంలో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

రైతు భరోసా పథకం కింద రూ.9వేల కోట్లను పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన.. ప్రగతిబాట కార్యక్రమంలో ప్రకటించారు. యాసంగి సీజన్‌లో పంపిణీ చేయడానికి వ్యవసాయశాఖ రైతుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది. అయితే, రైతు భరోసా పథకం నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేనట్లుగా తెలుస్తోంది. ఇందుకు బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకోనుంది. ఈ మేరకు ఆర్బీఐకి రూ.9వేల కోట్ల రుణం కోసం ఇండెంటు పెట్టింది. ఈనెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఆ తదుపరి రైతుల ఖాతాలకు సొమ్మును బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒకవేళ ఈనెల 10వ తేదీన రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయకుంటే.. ఆ తరువాత మరింత సమయం పట్టే అవకాశం ఉందన్న వాదన ఉంది. ప్రస్తుతం రైతు భరోసా పథకంకు సంబంధించి నిధులు సమకూరకుంటే.. మున్సిపల్ ఎన్నికల తరువాత రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమచేసే పరిస్థితులు చాలా తక్కువ. మళ్లీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వరకు రైతు భరోసా నిధులు జమయ్యే అవకాశం లేదన్న వాదన ఉంది. అయితే, ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలలో ఎలా ముందుకెళ్తుందోనన్న అంశంపై రైతులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఇక్కడో డౌట్ రావచ్చు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదా. మరి ఇప్పుడు మనీ ఇస్తే, ప్రతిపక్షాలు ఊరుకుంటాయా అని. ఇది కొత్తగా అమలు చేస్తున్న పథకం కాదు. ఎన్నికల కోడ్ అనేది కొత్త పథకాలకు మాత్రమే వర్తిస్తుంది. ఆల్రెడీ కొనసాగుతున్న పథకాలకు వర్తించదు. ఆ మాటకొస్తే.. ప్రతిపక్షాలు కూడా రైతులకు వచ్చే డబ్బును అడ్డుకొని.. రైతులకు అన్యాయం చేస్తాయని అనుకోలేం. అందువల్ల రైతు భరోసా మనీ ప్రభుత్వం ఇస్తే, కచ్చితంగా ఏ అడ్డంకులూ రాకపోవచ్చు.